సర్వే ఫలితాలతో ఖుషీగా టీఆర్ఎస్... కేసీఆర్ వ్యూహాలు ఫలించినట్టేనా?

హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.అయితే ఇక త్వరలో పోలింగ్ జరగనున్న తరుణంలో ఇక పూర్తి స్థాయిలో ఎలక్షనీరింగ్ పై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది.

 Trs Happy With Survey Results Are Kcr Strategies Fruitful, Huzurabad By Elctions-TeluguStop.com

అయితే పలు సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న తరుణంలో ఇక బీజేపీ కూడా టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టడంపై దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ కు బీజేపీ కంటే 14% ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సర్వేలు వెలువడుతున్న పరిస్థితిలలో బీజేపీ క్షేత్ర స్థాయిలో ఎలక్షనీరింగ్ పై పెద్ద ఎత్తున దృష్టి పెడుతోంది.

అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శిస్తున్న తరుణంలో హరీష్ రావు తన వ్యూహాలను ఇంకా బలంగా దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇలాగే టీఆర్ఎస్ తమ ఆధిక్యాన్ని కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉండగా బీజేపీ టీఆర్ఎస్ అడుగులను నిశితంగా గమనిస్తుండగా ఎక్కడా టీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వొద్దనే రీతిలో బీజేపీ వ్యవహరిస్తోంది.

ఏది ఏమైనా ఒక పదిహేను రోజుల క్రితం బీజేపీకి విజయావకాశాలు ఎక్కువ ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగిన పక్షంలో ఒక్కసారిగా ఈ పరిస్థితిని గమనించి కెసీఆర్ తన వ్యూహాలను మార్చి ప్రయోగించిన పరిస్థితి ఉంది.

Telugu @bjp4telangana, Bandi Sanjay, Cm Kcr, Congress, Dalitha Bandhu, Etela Raj

అయితే దళిత బంధు ప్రయోగం టీఆర్ఎస్ కు ఆశించినంతగా లాభం చేకూర్చకున్నా టీఆర్ఎస్ గెలుపుకు దోహదపడే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఇక రానున్న రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో కెసీఆర్ వ్యూహాలు వందకు వంద శాతం ఫలిస్తే  టీఆర్ఎస్ ప్రస్తుతం సర్వేలలో వ్యక్తమవుతున్న ఆధిక్యత ఇంకా పెరిగే అవకాశం ఉంది.మరి రెండు రోజులు ఎలక్షనీరింగ్ లో పార్టీలు అవలంబించే వ్యూహాలే ఎన్నికల ఫలితాలపై  ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube