ష‌ర్మిల‌ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ వ‌ర్గాలు.. ఘాటుగా పోస్టులు పెడుతున్న ష‌ర్మిల‌!

వైఎస్ ష‌ర్మిల‌కు పెద్ద‌గా కార్య‌క‌ర్త‌లు లేక‌పోవ‌డంతో ఆమె ఏది చేసినా చివ‌ర‌కు ట్రోలింగ్ కు గుర‌వుతోంది.ఎందుకంటే టీఆర్ ఎస్ నుంచి గానీ లేదా కాంగ్రెస్ నుంచి గానీ ఎవ‌రు కౌంట‌ర్లు వేసినా స్వ‌యంగా ఆమెనే రీ కౌంట‌ర్ వేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయి.

 Trs Groups Targeting Sharmila Sharmila Posting Intensely In Social Media,  Sharm-TeluguStop.com

ఇక ఇప్ప‌టికే వ‌రుస కౌంట‌ర్ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ష‌ర్మిల‌కు ఇప్పుడు టీఆర్ ఎస్‌కు చెందిన కేటీఆర్ అభిమానులు వ‌రుస ఝ‌ల‌క్‌లు ఇస్తున్నారు.ఇక రీసెంట్‌గా మొన్న శనివారం మంత్రి కేటీఆర్ బ‌ర్త్ డే జరిగిన విషయం అంద‌రికీ విదిత‌మే.

కాగా ఆయ‌న‌కు చాలామంది సెలబ్రిటీలు, పొలిటిక‌ల్ నేతలు శుభాకాంక్షలు చెప్పారు.

అయితే ష‌ర్మిల మొద‌ట్లో కేటీఆర్ అంటేనే తెలియ‌ద‌న్న‌ట్టు మాట్లాడిన ఆమె కూడా చివ‌ర‌కు కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.

కాకాపోతే ఆమె కొంచెం వెట‌కారంగా పోస్టు చేయ‌డంతో అది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింద‌ని చెప్పాలి.దీంతో భ‌గ్గుమ‌న్న కేటీఆర్ అభిమానులు ఒక్క‌సారిగా షర్మిలపై విరుచుకుప‌డి సెటైర్లు వేసేశారు.

ఆమె ట్వీట్‌కు రీ ట్వీట్లు ఇస్తూ దారుణ‌మైన కౌంట‌ర్లు వేశార‌నే చెప్పాలి.ఇక ఇలా వ‌రుస కౌంట‌ర్ల‌పై మరోసారి నిన్న ట్వీట్ ద్వారా షర్మిల స్పందించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తాను చేసిన బ‌ర్త్ డే విషెస్ పోస్టులో కేవ‌లం ఉద్యోగాల కావాలిన మాత్ర‌మే కోరాన‌ని, కానీ కేటీఆర్ అభిమానులు ఇలా త‌న‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారంటూ ఆవేద‌న చెందారు.నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకే త‌మ పోరాటం ఉంటుంద‌ని, అందుకోస‌మే పోరాడుతామ‌న్నారు.ఇక త‌న విషెస్‌తో ఉలిక్కిపడి నిరుద్యోగుల సమస్యలపైన త‌మ పోరాటాన్ని మరింత ప‌టిష్టం చేస్తూ మంచి ఆద‌ర‌ణ వ‌చ్చేలా కేటీఆర్ వ‌ర్గాలు చేశాయ‌ని, అందుకు ధన్యవాదాలు అని ష‌ర్మిల చుర‌క‌లంటించ‌డం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది.మొత్తానికి కేటీఆర్ సైన్యం ష‌ర్మిల‌కు బాగానే కౌంట‌ర్లు వేస్తోంద‌ని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube