కేంద్రంపై కోర్టులో పోరాటం ? కేసీఆర్ తో పెట్టుకుంటే ఇంతే !  

trs government legal fight againist central government about gst issue, Telangana, TRS, KCR, GST, Central Governament, TRS Legal Fight With Central, BJP, - Telugu Bjp, Central Governament, Gst, Kcr, Telangana, Trs, Trs Legal Fight With Central

తాను అనుకున్నది ఏదైనా సాధించే వరకు వదిలిపెట్టకుండా పోరాడుతూనే ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్.మొన్నటి వరకు కేంద్రంతో సఖ్యతగానే ఉన్నా, ఆ పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండటం, టిఆర్ఎస్ ప్రభుత్వ హవా ను తగ్గించి తెలంగాణలో బీజేపీబలపడే విధంగా చేస్తున్న ప్రయత్నాలు వంటి కారణాలతో చాలాకాలంగా కేసీఆర్ కేంద్రం తీరుపై గుర్రుగా ఉంటూ వస్తున్నారు.

TeluguStop.com - Trs Government Legal Fight Againist Central Government About Gst Issue

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కేసీఆర్ ఒక పార్టీ పెట్టబోతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టి పోరాటం చేస్తారని, ఇలా పెద్దఎత్తున ప్రచారం జరిగింది.అయితే ఇదంతా ఉత్తిదే అని స్వయంగా కేసీఆర్ కొట్టిపారేశారు.

TeluguStop.com - కేంద్రంపై కోర్టులో పోరాటం కేసీఆర్ తో పెట్టుకుంటే ఇంతే -Political-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు.దీంతోపాటు జీఎస్టీ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

జీఎస్టీ చట్టం ప్రకారం ఆదాయం తగ్గిపోయినప్పుడు కేంద్రం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలి.కానీ ప్రస్తుత ప్రభుత్వం ” యాక్ట్ ఆఫ్ గాడ్ “ పేరుతో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది.

నిధులు కావాలంటే ఆర్బీఐ వద్ద అప్పులు తీసుకోవాలని సూచిస్తోంది.

దీనిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.కేంద్రం చట్టంలోని నిబంధనలు పాటించాల్సిందేనని, రాష్ట్రాలకు సహాయం చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.పదే పదే ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నా, పట్టించుకోకపోవడంతో న్యాయపరంగా ఆ నిధులను రాబట్టేందుకు కేసీఆర్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ వ్యవహారంపై ప్రస్తుతం చర్చలు జరిపారు.నేడో రేపో పిటిషన్ కూడా వేసే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.ప్రస్తుతం కేంద్రంతో వివిధ అవసరాలు, భయాలు ఉన్నా, మిగతా రాష్ట్రాలు ఈ విషయంలో నోరు ఎత్తకపోయినా, తాను న్యాయ పోరాటం చేస్తే, తన తో జత కలిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ముందు కొత్త పార్టీ పెట్టినా తమకు అనుకూలంగా మారుతుందని కేసీఆర్ ఈ రకమైన ఎత్తుగడ వేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్ న్యాయ పోరాటానికి దిగితే, కేంద్రం ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఈ సమసి నుంచి బయటపడుతుందో చూడాలి.

#TRSLegal #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trs Government Legal Fight Againist Central Government About Gst Issue Related Telugu News,Photos/Pics,Images..