కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగితే.. టీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు ప్రస్తుతానికి వంద లోపు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినా రాబోయే రెండు వారాల్లో ఏం జరుగబోతుందో తెలియని పరిస్థితి.అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు చోట్ల ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 Trs Governament Ready To Make A Corona Isolation Wards, Telangana, Trs Govername-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా కనీసం అయిదు నుండి ఆరు వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినా కూడా వారికి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.

తాజాగా మంత్రి కేటీఆర్‌ కింగ్‌ కోఠిలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో 350 పడక సామర్థ్యంతో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది.

గచ్చిబౌలీలోని ఇండోర్‌ స్టేడియంలో ఏకంగా వెయ్యికి పైకా బెడ్‌ లను ఏర్పాటు చేసి ఐసోలేషన్‌ కేంద్రంను ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి ఈటెల ఇప్పటికే ప్రకటించారు.ఇక రైల్వే శాఖ కూడా రైలు బోగీలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చు అంటూ ప్రకటించింది.

మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదు అయినా కూడా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటుంది.అక్కడి వరకు పరిస్థితి రావద్దని ప్రతి ఒక్కరం కోరుకుందాం.

పూర్తిగా అంతా ఇంటికే పరిమితం అయితే పరిస్థితి అక్కడి వరకు చేరదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube