హైద‌రాబాద్ మేయ‌ర్‌కు టీఆర్ఎస్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ‘ బొంతు ‘ ను బోల్తా కొట్టించారే…!  

trs gave bumper offer to hyderabad mayor,telangana,political news,hyderabad,mayor,bonthu ram mohan,TRS,bumper offer,GHMC elections,KCR,telangana chief minister, - Telugu Bonthu Ram Mohan, Bumper Offer, Ghmc Elections, Hyderabad, Kcr, Mayor, Political News, Telangana Chief Minister, Trs, Trs Government

హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ను టీఆర్ఎస్ అధిష్టానం తెలివిగా బోల్తా కొట్టించిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.గ‌త గ్రేట‌ర్ ఎన్నికల్లో గెల‌వ‌డంతో పాటు పార్టీ కోసం ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించిన కేసీఆర్ నేరుగా ఆయ‌న్ను మేయ‌ర్‌గా చేశారు.

TeluguStop.com - Trs Gave Bumper Offer To Hyderabad Mayor

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉప్ప‌ల్ సీటు కోసం నానా ర‌భ‌స చేయ‌డంతో పాటు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాల‌ని చూసి చివ‌ర‌కు వెన‌క్కు త‌గ్గారు.ఆ త‌ర్వాత బొంతుపై అనేకానేక ఆరోప‌ణ‌లు సొంత పార్టీలోనే వ‌చ్చాయి.

ప‌లువురు ఎమ్మెల్యేల‌తోనూ ఆయ‌న‌కు గ్యాప్ ఉంది.

TeluguStop.com - హైద‌రాబాద్ మేయ‌ర్‌కు టీఆర్ఎస్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. బొంతు ను బోల్తా కొట్టించారే…-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజా ఎన్నిక‌ల్లో మేయ‌ర్ ప‌ద‌వి జ‌న‌ర‌ల్ మ‌హిళు రిజ‌ర్వ్ చేయ‌డంతో త‌న భార్య శ్రీదేవికి కార్పొరేట‌ర్ సీటు ఇప్పించుకోవాల‌ని చూశారు.

చ‌ర్ల‌ప‌ల్లి డివిజ‌న్ నుంచి త‌న భార్య‌ను పోటీ చేయించాల‌ని రామ్మోహ‌న్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా స్థానికులు మాత్రం రామ్మోహ‌న్‌కు వ్య‌తిరేకంగా చాప‌కింద నీరులా త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేశారు.చివ‌ర‌కు టీఆర్ఎస్ అధిష్టానానికి సైతం రామ్మోహ‌న్ భార్య‌కు కార్పొరేట‌ర్ టిక్కెట్ ఇవ్వ‌డం ఇష్టం లేక‌పోవ‌డంతో ఆ డివిజ‌న్ అభ్య‌ర్థి పేరు ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.

అయితే టీఆర్ఎస్ రామ్మోహ‌న్‌ను చాలా వ్యూహాత్మ‌కంగా ఎమ్మెల్సీగా బ‌రిలోకి దింపే అవ‌కాశం ఉంద‌ని అంతా భావిస్తున్నారు.హైద‌రాబాద్ – రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఇక్క‌డ నుంచి రామ్మోహ‌న్‌ను బ‌రిలోకి దింప‌డంతో పాటు తాము ఎమ్మెల్సీ సీటు ఇచ్చామ‌ని చెప్పుకున్న‌ట్టుగా ఉంటుంద‌ని ప్లాన్ చేస్తోంది.వాస్త‌వంగా చూస్తే ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ గెల‌వ‌ద‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి నివేదిక‌లు అందాయి.

ఖ‌చ్చితంగా పార్టీ ఓడిపోతుంద‌ని తెలిసిన చోట రామ్మోహ‌న్‌కు సీటు ఇచ్చి చేతులు దులుపు కోవాల‌ని పార్టీ ప్లాన్‌.అంటే రామ్మోహ‌న్‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చామ‌ని అటు పార్టీ వాళ్లు చెపుతారు.

ఆయ‌న ఓడిపోతే మాకు సంబంధం లేద‌ని సింపుల్‌గా చేతులు దులిపేసుకోవచ్చు.ఏదేమైనా రామ్మోహ‌న్‌ను టీఆర్ఎస్ అధిష్టానం తెలివిగా బోల్తా కొట్టించిందే అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

#TelanganaChief #Hyderabad #Mayor #TRS Government #GHMC Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trs Gave Bumper Offer To Hyderabad Mayor Related Telugu News,Photos/Pics,Images..