మిమ్మల్ని మించి... అంతకు మించి ! విడుదల కాబోతున్న టీఆర్ఎస్ మ్యానిఫెస్టో

మీకంటే మేము నాలుగు ఆకులు ఎక్కువ చదివామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతున్నాడు.ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలకంటే మెరుగైన హామీలు ప్రజలకు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మించి ఉండేలా…టీఆర్ఎస్ తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.

 Trs Full Manifesto 2018 Will Be Coming On Nov 6-TeluguStop.com

ప్రస్తుతం టీఆర్ఎస్ ఇస్తున్న హామీలు కూడా అన్ని కాంగ్రెస్ ప్రకటించిన హామీలే కాకపోతే వాటిని కాస్త పెంచి చూపిస్తున్నారు అంతే.నిరుద్యోగ భృతి, రూ.లక్ష రుణమాఫీ, పెన్షన్ల పెంపు.ఇలా అన్నీ కాంగ్రెస్ హమీలే.

టీఆర్ఎస్ ఇస్తున్న హామీలు చూసి కాంగ్రెస్ నాయకులు గోల గోల చేస్తున్నారు.ఇవన్నీ మా పార్టీ హామీలు మీరు కాపీ కొట్టారు ఇది తొండి అంటూ మారం చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్ కి దిమ్మతిరిగేలా .వారు అస్సలు ఊహించని విధంగా… టీఆర్ఎస్ తన మ్యానిఫెస్టో సిద్ధం చేస్తోంది.ఈ నెల ఆరో తేదీన … తెలంగాణ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తేలా సరికొత్త మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధం అవుతోంది.దీనికి సంబంధించిన సూచనలు ఒక్కొక్కటిగా.

కేటీఆర్ బయటకు ఇస్తున్నారు.రూ.లక్ష రుణమాఫీ చేస్తామని.ఓ భాగం హామీల్లో ప్రకటించారు కానీ.

ఎలా చేస్తారన్నదానిపై కేసీఆర్ హామీ ఇవ్వలేదు.గతంలో చేసినట్లు చేస్తామని చెప్పడంతో.

విడతల వారీగానేనని.అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు.

కానీ మంత్రి కేటీఆర్ మాత్రం ఒకే విడతలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని యాదాద్రి ప్రచార సభలో ప్రకటించి దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

నవంబర్ 6 వ తేదీన విడుదల చేయబోయే పూర్తిస్థాయి మ్యానిఫెస్టోలో దాదాపు … అరవై హామీలు ఉండబోతున్నాయట.ఇవన్నీ.ఓట్లు కురింపించే.జనాకర్షక హామీలేనంటున్నారు టీఆర్ఎస్ నేతలు.వేయడానికి మేనిఫెస్టో కమిటీ అంటూ కేకే నేతృత్వంలో ఓ కమిటీని వేసినా….ఇటీవలి కాలంలో ఫామ్‌హౌస్‌లో మకాం వేసిన కేసీఆర్.

మేనిఫెస్టోని ఫైనల్ చేశారట.కేకే కమిటీకి.

వివిధ వర్గాల నుంచి వచ్చిన 300 కు పైగా విజ్ఙప్తులను ఆ కమిటీ కేసీఆర్‌కు అందించారు.వీటన్నింటినీ స్వయంగా పరిశీలించి పథకాలను సిద్ధం చేశారు.

దళితుల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని గమనించి.కడియం శ్రీహరిని ప్రత్యేకంగా పిలిపించి ఓ రోజంతా చర్చించి.

దళితలకు వరాలను రెడీ చేశారు.దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకునే విధంగా… పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ఉండబోతున్నట్టు టీఆర్ఎస్ నాయకులు ధీమాగా చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube