వచ్చే సార్వత్రిక ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్... అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్న పరిస్థితి ఉంది.పరిణామాలు కూడా వేగంగా మారుతున్న విషయాల్ని మనం చూస్తున్నాం.

 Trs Focus On The Upcoming General Election  This Is The Real Strategy Kcr, Trs P-TeluguStop.com

అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చాలా వరకు బలహీనంగా ఉన్న పరిస్థితి ఉంది.అందుకే చాలా సునాయాసంగా ఎటువంటి గట్టి పోటీ లేకుండా టీఆర్ఎస్ అత్యధిక స్థానాలలో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.గతంతో పోలిస్తే ప్రతిపక్షాలు చాలా బలంగా ముందుకు సాగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ఇటు కాంగ్రెస్ కావచ్చు,బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుత పరిణామాలు గత రెండు సార్వత్రిక ఎన్నికల పరిణామాల కంటే భిన్నంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైన పరిస్థితి ఉంది.

Telugu @cm_kcr, @trspartyonline, Harishrao, Telangana-Political

అందుకే ఇప్పటి నుండే సార్వత్రిక ఎన్నికలపై టీఆర్ఎస్ పెట్టడానికి పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున దూసుకుపోతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కావున విమర్శలకు ప్రతి విమర్శలు గుప్పిస్తే ప్రజలు హర్షించరు.ప్రజలు పనిని కోరుకుంటారు.

అందుకే ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల విమర్శలకు ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కూడా ఇప్పటికే సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రజలు ఏయే విషయాల పట్ల ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారనే విషయంపై ఒక నివేదిక ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.దానికనుగుణంగానే ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు ఉండే అవకాశం వంద శాతం ఉంది.

ఎందుకంటే ప్రజాగ్రహ  విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందనే విషయం కెసీఆర్ కు తెలియనిది కాదు.ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి ఈ రెండున్నర సంవత్సరాల సమయం చాలా ముఖ్యమనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube