కూటమి ఎత్తులకు చిత్తవుతున్న టీఆర్ఎస్

పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేసిన ఈ సమయంలో టీఆర్ఎస్ ను రకరకాలుగా ఇబ్బంది పెట్టేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.రకరకాల ఎత్తుగడలతో టీఆర్ఎస్ కి దడ పుట్టించేలా కాంగ్రెస్ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.

 Trs Fear About Mahakutami In Telangana Elections-TeluguStop.com

కూటమిలోని పార్టీలకు ఉమ్మడి శత్రువైన టీఆర్ఎస్ , బీజేపీలకు అధికారం దక్కకుండా చేయడం తమ ప్రథమ కర్తవ్యంగా కాంగ్రెస్ పనిచేస్తోంది.బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు వేరు కాదు అంటూ… అవి చీకటి ఒప్పందంలో భాగంగానే… నాటకాలు ఆడుతున్నాయి అంటూ కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని సాక్ష్యాలను చూపిస్తోంది.

టీఆర్ఎస్ ను ఇప్పటివరకు తెలంగాణలోని ప్రభుత్వ పధకాల గురించి మాత్రమే … విమర్శలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్.కేసీఆర్ కార్మిక శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తున్నారు

హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ భవన నిర్మాణంలో పెద్ద కుంభకోణం జరిగిందని నామినేషన్‌ పద్దతిలో సీవీసీ గైడ్‌లైన్స్‌కు అతీతంగా ఆ పనులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు .అంతే కాదు…


తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకే మోడీతో కేసీఆర్ జతకట్టారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలోనే కేసీఆర్‌, మోదీల ఏర్పడిన రహస్య బంధం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని విమర్శించారు.ఈఎస్‌ఐలో జరిగిన అక్రమాలను సీబీఐ బయటపెడుతున్న సందర్భంలోనే కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారంటూ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

ఈ కుంభకోణంలో ఏ-1గా ఉన్న ఉన్న కేసీఆర్‌ కంటి శస్త్రచికిత్స పేరుతో ఢిల్లీ వెళ్లి ఛార్జిషీట్‌లో తన పేరును తొలగించుకున్నారని ఆరోపణలు చేశారు.సహారా కుంభకోణంలో కూడా కేసీఆర్‌ ప్రధాన భూమిక పోషించారని, ఆ కుంభకోణంలో ఎన్ని కోట్ల కమీషన్‌ వచ్చిందంటూ ఆరోపణలు గుప్పించారు బీజేపీతో ఉన్న రహస్య ఒప్పందం కారణంగానే విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోయినా ప్రశ్నించడంలేదన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శిస్తున్న కేసీఆర్‌ ప్రధాని, బీజేపీలను ప్రశ్నించకపోవడం వెనక కేసులే కారణమన్నారు.ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ… టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube