బీజేపీ కార్పొరేటర్ లపై టీఆర్ఎస్ కన్ను ?

కొద్దిరోజుల క్రితమే హోరాహోరీగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో మొదటి స్థానంలో టిఆర్ఎస్ , రెండో స్థానంలో బిజెపి,  మూడో స్థానంలో ఎంఐఎం వరుసగా ఫలితాలు సాధించాయి.అయితే టిఆర్ఎస్ సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అంత స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది.

 Trs Try To Joinings On Bjp Corporates, Bjp, Trs, Corporators, Greater Hyderabad-TeluguStop.com

ఆ పార్టీ ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నా కష్టమే.మరికొన్ని సీట్లు అదనంగా కావాల్సిందే.

కాకపోతే మొదటి నుంచి టిఆర్ఎస్ కు సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఎంఐఎం పార్టీ గ్రేటర్ ఎన్నికల లో టిఆర్ఎస్ పైన విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరిగాయి.ఈ రెండు పార్టీల అగ్రనేతలకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు ఎంఐఎం సిద్ధంగానే ఉన్నట్లు సంకేతాలు పంపిస్తుంది.
అయితే ఆ పార్టీ మద్దతు తీసుకుంటే , రాబోయే రోజుల్లో ఎంత నష్టపోతాము అనేది టిఆర్ఎస్ కు బాగా తెలుసు.అందుకే ఆ పార్టీ తో పొత్తు పెట్టుకునేందుకు  ఇష్టపడడం లేదు.

కానీ బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ల లో వీలైనంత ఎక్కువమందిని తమ పార్టీలో చేర్చుకునే ప్లాన్ కు శ్రీకారం చుట్టినట్లు బీజేపీ అనుమానిస్తోంది.బిజెపి కార్పొరేటర్ల ను  చేర్చుకుని మేయర్ ఎన్నికలలో గెలవాలి అని కేసీఆర్ చూస్తూ రాజకీయం చేస్తున్నారంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిస్తున్నారు.

అందుకే ప్రతి ఒక్కరు పైన నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక టిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు అందరినీ భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేశారు.

మా కార్పొరేటర్ల జోలికి వస్తే మీ ఎమ్మెల్యేలను మా పార్టీలోకి చేర్చుకుంటాము అంటూ హెచ్చరికలు కూడా చేశారు.కానీ టిఆర్ఎస్ గ్రేటర్ మేయర్ పీఠం కోసం ఎంతకైనా తెగిస్తుందనే అనుమానంతో కార్పొరేటర్లు అందర్నీ బిజెపి బుజ్జగిస్తూ, చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube