ఆ హామీల అమలు ఎలా ? కేసీఆర్ కి నిద్రపట్టడంలేదే ?  

Trs Elections Manifesto Farmmer Runamafi-

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు చూస్తే అసలు ఇవి అమలు సాధ్యమేనా ? ఆ హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకు వస్తారు ? అసలు ఏ ధైర్యంతో ఇటువంటి హామీలు ఇస్తున్నారు అనే సందేహం సామాన్యుల్లో కూడా వ్యక్తం అవుతుంది.అయినా రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద హామీల వర్షం కురిపించేస్తుంటాయి.తెలాంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా భారీ భారీ ఎన్నికల హామీలు ఇచ్చేసింది...

Trs Elections Manifesto Farmmer Runamafi--TRS Elections Manifesto Farmmer Runamafi-

కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను మించి టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ఉండేలా జాగరత్తలు తీసుకుంది.ఏదైతేనేమి పార్టీ అధికారంలోకి వచ్చేసింది.మొన్నటివరకు ఎన్నికల కోడ్ అమలు లో ఉండడంతో ఎన్నికల హామీల మీద ద్రుష్టి పెట్టలేదు.

ఇప్పుడు వాటిని అమలు చేద్దాం అంటే గుండె గుబేల్ అంటోంది.

Trs Elections Manifesto Farmmer Runamafi--TRS Elections Manifesto Farmmer Runamafi-

ఎన్నికల్లో కాంగ్రెస్‌ రూ.రెండు లక్షల ఒకే సారి రుణమాఫీ హామీతో పాటు, అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది.దీంతో టీఆర్ఎస్ కూడా రుణమాఫీ పథకం ప్రకటించింది.

కాకపోతే రూ.లక్ష మాత్రమే ప్రకటించింది.అదీ ఒకే సారి చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ హామీ ఇచ్చారు...

గెలిచిన తర్వాత ఆ హామీలన్నీ అమలు చేయడం ఇప్పుడు తలకు మించిన భారంగా కనిపిస్తోంది.ముఖ్యంగా రూ.లక్ష రుణమాఫీని ఎలా అమలు చేయాలని మల్లగుల్లాలు పడుతోంది.

దానికి సంబందించిన నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతం అవుతోంది.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్ష రుణమాఫీ చేయడానికి బ్యాంకర్ల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు.

ఇవి రూ.24 వేల కోట్లుగా తేలింది.

అయితే అంత మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేయడం కుదరని పని కాబట్టి నాలుగు విడతలుగా ఆ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు.ఈ రుణాలను ఏటా ఆరువేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కూడా ప్రకటించారు...

ఈ ఏడాదిలో ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై క్లారిటీ లేదు.రైతు బంధు కోసం రూ.6900 కోట్లు ఇప్పటికే విడుదల చేసారు.ఆసరా పెన్షన్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో మరో రెండు, మూడు నెలల పాటు నిధుల కొరత తీవ్రంగా ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు తీసుకుంటే తప్ప పెద్ద పద్దులు చెల్లించే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు.ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.