బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈసీకి టిఆర్ఎస్ ఫిర్యాదు ..!

బీజేపీ ఎంపీ , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసి ఫిర్యాదు చేశారు.టిఆర్ఎస్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు.

 Trs Coplaint On Bandi Sanjay Over Ghmc Election Campaign, Bandi Sanjay, Ktr, Kcr-TeluguStop.com

ఈ శుక్రవారం బండి సంజయ్ అన్ని మతాలకు కేంద్రబిందువైన చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరలో ఎన్నికల ప్రచారం చేస్తూ కేసీఆర్ మరియు ఎంఐఎమ్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధం.

సీఎం కేసీఆర్‌ దేశ ద్రోహి, హిందూ వ్యతిరేకి.అఫ్జల్‌ గురు, ఒసామాబిన్‌ లాడెన్‌, యాకుబ్‌ మీనన్‌, బాబర్‌,ఔరంగజేబు, అక్బర్‌ వారసులు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీ నాయకులు, అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్నరంటూ బండి సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Telugu Bandi Sanjay, Ghmc, Greater-Telugu Political News

ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ మరియు పార్టీ నాయకులూ స్పందించారు.టీఆరెఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసి బండి సంజయ్ ఎన్నికల నియమావళిని ఉల్లంగిస్తూ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని ఫిర్యాదు చేశారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.సోషల్‌ మీడియా, టెలివిజన్‌ ఛానెల్స్‌లో ప్రసారం అయిన ఈ వాఖ్యల వీడియోలను టీఆర్‌ఎస్‌ నాయకులు ఆధారాలుగా ఎస్‌ఈసీకి అందజేశారు.

అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బండి సంజని అరెస్ట్ చేయవలసిందిగా కోరారు.అదేవిదం గా ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుండా తగుచర్యలు తీసుకోవలసిందిగా ఈసీ కి ఫిర్యాదుల పత్రం అందజేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube