‘దళిత బంధు’ వేదికగా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన.. కేసీఆరే ప్రకటిస్తారా..?

హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి దాదాపుగా ఖరారయినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించకుంటున్నాయి.విద్యార్థినేత, టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫిక్స్ అయినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 Trs Candidate Announcement As Dalit Bandhu Platform Will Kcr Announce It, Trs Ca-TeluguStop.com

అయితే, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు? ఎక్కడ? ఉండబోతున్నది? ఎవరు ప్రకటించనున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

హుజురాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారని సంగతి తెలిసిందే.

కాగా, ఈ పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోనే లాంఛనంగా ఈ నెల 16న ప్రారంభించడానికి అక్కడికి సీఎం వెళ్లనున్నట్లు సమచారం.ఈ క్రమంలోనే అక్కడే నియోజకవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును అఫీషియల్‌గా సీఎం అనౌన్స్ చేసే చాన్సెస్ ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇక ఇప్పడు ఉన్న స్పీడ్ కంటే ఇంకా వేగంగా, విస్తృతంగా టీఆర్ఎస్ ప్రచారం అప్పుడు ఉండబోతున్నదని తెలుస్తోంది.హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రతీ గడప తొక్కి కారు గుర్తుకు ఓటు వేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయాలని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాబోతున్నట్లు సమాచారం.

అయితే, తొలుత హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.

Telugu Etela Rajender, Gellusrinivas, Huzurabadtrs, Huzurabad, Kcr Official, Trs

సామాజిక వర్గాల సమీకరణాల దృష్ట్యా గెల్లును ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంద.ఇక ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసిన సంగతి అందరికీ విదితమే.మొత్తంగా బీసీ అభ్యర్థియైన ఈటల రాజేందర్‌కు కౌంటర్ అటాక్‌గా బీసీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ పోటీలో దింపబోతున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీలో తొలి నుంచి ఉన్న నేపథ్యం, స్థానికత అనగా హుజురాబాద్‌లోని వీణవంక మండలానికి చెందిన వాడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కలిసి వచ్చే అంశాలు అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube