ఇక లాభం లేదని ప్రవీణ్ కుమార్‌పై పాత కేసులు తెరపైకి తెస్తున్న టీఆర్ఎస్?

సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.

 Trs Bringing Old Cases Against Praveen Kumar To The Screen That There Is No Prof-TeluguStop.com

ప్రవీణ్ కుమార్ తెలంగాణ పాలిటిక్స్‌లో‌కి బీఎస్పీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా ఎన్జీ కాలేజీలో జరిగిన సభలో టీఆర్ఎస్ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సూటిగానే విమర్శలు చేశారు.

సభ కూడా ఫుల్ సక్సెస్ అయింది.ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అంతర్మధనంలో పడినట్లు తెలుస్తోంది.దళితులంతా తమ వైపు ఉన్నారని భావించిన గులాబీ పార్టీకి షాక్ తగిలిందనే చెప్పొచ్చు.కాగా, ప్రజెంట్ ప్రవీణ్‌ను ఎదుర్కొనేందుకుగాను అధికార పార్టీ కొత్త అంశాలను తెరమీదకు తెస్తున్నది.

అవేంటంటే.డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో పోలీసు అధికారిగా ఉన్న సమయంలో దళిత మావోయిస్టులను టార్గెట్ చేశారనే ఆరోపణలు చేస్తున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.

Telugu Praveen Kumar, Tg-Telugu Political News

దీంతో పాటు ప్రవీణ్ ఉస్మానియా స్టూడెంట్స్ , ఉద్యమకారులపైన అక్రమ కేసులు పెట్టారనే విషయాలను పింక్ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.తద్వారా ప్రవీణ్ తెలంగాణ వ్యతిరేకి అని, దళిత వర్గాలకు మేలు చేయబోడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు.కాగా, స్వేరో నెట్‌వర్క్ ద్వారా ప్రవీణ్ మంచి పేరు సంపాదించుకోగా, దానిని కూడా బద్నాం చేసేందుకు గులాబీ నేతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, సీఎంపై ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల ద్వారా ప్రవీణ్ వర్సెస్ టీఆర్ఎస్ అనే సీన్ క్రియేట్ కాకుండా ఉండేందుకే ఎమ్మెల్యేలు కిషోర్, సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు కౌంటర్ అటాక్ చేసినట్లు సమాచారం.

అయితే, తన విమర్శల ద్వారా అప్పుడే ప్రతిపక్ష పార్టీ హోదాను డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పొందారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.చూడాలి మున్ముందు ఇంక ఏం జరుగుతుందో మరి.నల్లగొండ సభ తర్వాత డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube