కారుకి రోలర్ .. కమలానికి క్యాలీ ఫ్లవర్ ! వామ్మో కష్టాలు మామూలుగా లేవు ?

 తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోతున్న ఎన్నికలు ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాస్త గట్టిగానే కష్టపడుతున్నాయి.

 Trs Bjp Is Under Tension Over Election Symbols, Trs, Bjp, Congress, Trs, Telanga-TeluguStop.com

ఈ ఎన్నికల్లో ఎవరికి వారు విజయం సాధించాలనే తపనతో గట్టిగా కష్టపడుతున్నారు.ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు అనేక వ్యూహాల్లో నిమగ్నమైనా, ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ బిజెపి మధ్య నెలకొంది.

ఇప్పటికే ఎన్నికల ప్రచారం తో ఈ నియోజకవర్గాన్ని హోరెత్తిస్తున్నారు .హుజురాబాద్ లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పాటు, నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా ముగిసింది.
  దీంతో ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.వీరిలో ముగ్గురు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా ఏడుగురు రిజిస్టర్ అయిన పార్టీల నుంచి పోటీపడుతున్నారు.

మరో 20 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు.ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ కారు గుర్తు , బిజెపి ఎన్నికల గుర్తు అయిన కమలం ను పోలి ఉన్న ఎన్నికల గుర్తు ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ లకు రావడం పెద్ద టెన్షన్ కలిగిస్తోంది.

హుజురాబాద్ లో ఇండిపెండెంట్ లకు రోడ్ రోలర్,  చపాతీ రోలర్ గుర్తులు వచ్చాయి.ఇవే అధికార పార్టీ టిఆర్ఎస్ కు కంగారు పుట్టిస్తోంది.ఇక బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం ను పోలి ఉన్నట్లుగా  కాలీఫ్లవర్ సింబల్  మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కి వచ్చింది.దీంతో రెండు పార్టీలకు ఇవి పెద్ద తలనొప్పిగా మారాయి.
 

Telugu Califlower, Car Symbol, Congress, Symbols, Hujurabad, Lotus, Telangana-Te

 దుబ్బాక ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తు కారణంగా టిఆర్ఎస్ కు చాలా పెద్ద నష్టమే జరిగింది.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే బిజెపికి దాదాపు వెయ్యి ఓట్లు ఎక్కువ వచ్చాయి.  టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారుని పోలిన విధంగా రోడ్డు రోలర్ ఉండడంతో టిఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి కి పడ్డాయి.ఈ విధంగా నాలుగు వేల ఓట్లు తేడా రావడంతో బీజేపీకి విజయం దక్కింది.

ఇక్కడ అదే సీన్ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి అనే టెన్షన్ లో అటు టీఆర్ఎస్, ఇటు బిజేపి లో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube