ఈటెల నోటికి తాళం వేసేలా టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం.. అదేంటంటే?

మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత నుండి తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈటెల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే ఈటెలపై భర్తరఫ్ వేటు వేయడం, విచారణ కమిటీని నియమించడం, తరువాత మంత్రి గంగుల కమలాకర్ కు హుజూరాబాద్ బాధ్యతలు అనధికారికంగా ఇచ్చిన కేసీఆర్ ఇక గంగుల ఎంట్రీతో ఒక్కసారిగా అందరి చూపు హుజూరాబాద్ వైపు పడింది.

 Trs Armory Strategy To Lock The Mouth Of The Etela Is That So-TeluguStop.com

అయితే ఇప్పుడే ఇక అసలు రాజకీయం మొదలైందని చెప్పవచ్చు.అయితే టీఆర్ఎస్ లో హుజూరాబాద్ లో పర్యటిస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ ఈటెల నోటికి తాళం వేసేలా పకడ్బందీ ప్రణాళికలు వేసింది.

 Trs Armory Strategy To Lock The Mouth Of The Etela Is That So-ఈటెల నోటికి తాళం వేసేలా టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం.. అదేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Eetela Rajendar, Huzurabad Constituency, Mla Etela Rajender, Telangana Politics-Political

అయితే ఇక బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టారని ఒక వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తూ, మండలానికో ఇంచార్జిని నియమించి ఈటెల ను తన స్థానాన్ని పదిలం చేసుకునే విధంగానే దృష్టి సారించేలా ఈటెల ఆలోచనను మల్లించి ఈటెలకు జరగబోయే నష్టాలను అతనికి కళ్ళకు కట్టినట్లు చూపించడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.ఇప్పటికే ఆ ఎఫెక్ట్ ఈటెలపై పడిందని చెప్పవచ్చు.నా నియోజకవర్గంపై రాబందులలా దాడి చేస్తున్నారని ఈటెల అభిప్రాయపడుతున్నాడంటే ఎఫెక్ట్ అనేది ఈటెల అంచనా వేసాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బీజేపీలో ఈటెల చేరిక ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఈటెల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

#Eetela Rajendar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు