టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఘన విజయం!  

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్ధుల విజయం. .

  • తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు ఉదయం జరగగా, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలలో 98 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇదిలా వుంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలని బహిష్కరించింది. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ తరుపున పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల విజయం ఖాయమైపోయింది.

  • ఇదిలా వుంటే ఎమ్మెల్సీల విజయం అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికలలో ప్రజలు పూర్తిగా కేసీఆర్ నాయకత్వంకి పట్టం కట్టారని అన్నారు. ఇలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 16కి 16 సీట్లు అందిస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వుంటుంది అని కేటీఆర్ తెలియజేసారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కేంద్రంలో ఎ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేననుందిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కీలకంగా మారుతారని తెలియజేసారు.