తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో చండూరు ప్రచార సభలో పాల్గొన్న ఆయన విమర్శలు గుప్పించారు.
ఒక్కసారికి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వాలని కోరారు.మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే తెగువ పాల్వాయి స్రవంతికే ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యువతను తాగుబోతులుగా టీఆర్ఎస్, బీజేపీలు మారుస్తున్నాయని ఆరోపించారు.మునుగోడును టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు.