తాగి కార్లు నడుపుతున్నారా ఏంటి? రోడ్డుపై కాకుండా మనుషులమీదనుండి పోనిస్తున్నారు?

ఈ మధ్య డ్రైవర్లు కార్లు రోడ్లపైనుండి కాకుండా, మనుషులపై నడుపుతున్నారు.ప్రతిరోజూ ఇలాంటి ఉదంతాలు మనం ఎక్కడో ఒకచోట మనం చూస్తూనే వున్నాం.

 Trriable Road Accident In Bangalore Road, Accident, Viral Latest, Viral News, Social Media-TeluguStop.com

తాజాగా బెంగళూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది.రోడ్డుపై నడిచి వెళ్తున్న పాదాచారులపైకి ఓ కారు వేగంగా వచ్చి దూసుకుపోయింది.

ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందాగా, మరో ముగ్గురు చాలా తీవ్రంగా గాయపడ్డారు.శుక్రవారం (మే 20) ఉదయం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే, 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న పాదాచారులపైకి కారు వేగంగా దూసుకొచ్చింది.ఈ ఘటనతో ఒక్కసారిగా కారు ఢీకొన్న వ్యక్తి వెంటనే గాల్లోకి ఎగిరిపడ్డాడు.మరో ముగ్గురు పార్కింగ్ వాహనాల మధ్య పడి గాయాలపాలయ్యారు.శివమొగ్గ జిల్లాకు చెందిన అలియాస్ సురేష్ కుమార్‌ క్యాటరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు.తోటి ఉద్యోగులతో కలిసి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు.

 Trriable Road Accident In Bangalore Road, Accident, Viral Latest, Viral News, Social Media -తాగి కార్లు నడుపుతున్నారా ఏంటి రోడ్డుపై కాకుండా మనుషుల మీద నుండి పోనిస్తున్నారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతడు రుద్రప్పబస్టాప్‌ వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి కారులో వేగంగా వెళ్తుండగా కంట్రోల్ కోల్పోయాడు.

ఈ ప్రమాదంలో రుద్రప్ప తీవ్రంగా గాయపడ్డాడు.సహచరులు సచిన్‌, శివరాజుతోపాటు విద్యార్థి శైలేంద్రను ముఖేష్‌, స్నేహితుడుతో ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రుద్రప్ప మరణించాడు.గత రెండు రోజులుగా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ముఖేష్‌ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో రికార్డు అయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube