ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు తప్పని తిప్పలు..!

Troubles For Pawan Kalyan Hari Hara Veeramallu Movie Queen Role

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎంతో డిమాండ్ వుంటుంది.ఒక సినిమాలో చూసిన హీరోయిన్ ను పదేపదే సినిమాలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు ఈ క్రమంలోనే కొత్త హీరోయిన్ల కోసం దర్శక నిర్మాతలు ఎంతో శ్రమిస్తూ ఉంటారు.

 Troubles For Pawan Kalyan Hari Hara Veeramallu Movie Queen Role-TeluguStop.com

ఇక సీనియర్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి వారికి హీరోయిన్లు దొరకాలంటే ఎంతో కష్టం.ఇలా వీరి సినిమాలలో హీరోయిన్ల కోసం దర్శక నిర్మాతలు హీరోయిన్లకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందిస్తూ హీరోయిన్లను తీసుకుంటారు.

ఇప్పుడు ఈ హీరోయిన్ కష్టాలు పవన్ కళ్యాణ్ కు తప్ప లేదని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ తో పాటు ముందుగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఫైనల్ చేశారు.

 Troubles For Pawan Kalyan Hari Hara Veeramallu Movie Queen Role-ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు తప్పని తిప్పలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సారిగా పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక చిత్రంలో నటించడం వల్ల ఇందులో రాణి పాత్ర కోసం ఈమెను ఎంపిక చేసుకున్నారు.ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిన తర్వాత జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో భాగంగా సుకేశ్ చంద్రశేఖర్ తో సంబంధాలున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Telugu Krish, Nidhi Agarwal, Pawan Kalyan, Pawankalyan, Queen Role, Tollywood, Troubles-Movie

ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈమెను విచారించడంతో దర్శకుడు క్రిష్ అనవసరంగా రిస్కు చేయడం ఎందుకు అని భావించి ఈ సినిమా నుంచి ఈమెను తప్పినట్లు తెలుస్తోంది.ఈమె స్థానంలో మరో హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు.ఇప్పటికే నర్గీస్ ఫక్రీ, లారిస్సా బొనెసి వంటి వారిని సంప్రదించగా.వారు పలు కారణాల చేత రిజెక్ట్ చేశారని టాక్‌. మరి ఈ సినిమాలో పవన్ సరసన రాణి పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తారో తెలియాల్సి ఉంది.

#Troubles #Pawan Kalyan #Queen #PawanKalyan #Nidhi Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube