గొంతు నొప్పి తో ఇబ్బంది పడుతున్నారా..?! ఉపశమనం కోసం ఇలా ట్రై చేయండి..!

కొంత మందికి సీజన్ మారిన సమయంలో గొంతు నొప్పితో బాధ పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది.

 Troubled With Sore Throat Try This For Relief-TeluguStop.com

గొంతు నొప్పితో బాధపడే సమయంలో ఇంట్లో ఉండే సహజ పద్ధతిలోనే ఇట్టే నయం చేసుకోవచ్చు.అందుకు చిన్న చిట్కాలు పాటిస్తే సరి.అవి ఏంటో ఒకసారి చూద్దామా.

ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కాస్త అల్లం ముక్కలు వేయాలి.

 Troubled With Sore Throat Try This For Relief-గొంతు నొప్పి తో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం ఇలా ట్రై చేయండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లం ముక్కలు బాగా మరిగిన అనంతరం ఆ  నీటిని  వడకట్టి తాగితే గొంతు నొప్పి నుంచి ఇట్లే బయటపడవచ్చు.అలాగే ఇంట్లో లభించే లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క ,అల్లం లాంటి పదార్థాలను ఉపయోగించి టి తయారు చేసుకొని వేడి వేడిగా తాగితే సరి గొంతు నొప్పి ఇట్లే మటుమాయం అయిపోతుంది.

అంతేకాకుండా ఎవరైనా చికెన్ తినే వారు ఉంటె గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ నుంచి బయట పడాలంటే వేడివేడిగా ఉన్న చికెన్ సూప్ తాగితే గొంతు నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.ఈ సమస్యకు చికెన్ సూప్ ఒక ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

అలాగే గోరు వెచ్చని నీటిలో  కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే సరి.ఇందులో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ గుణాలు వల్ల గొంతునొప్పిని సులువుగా తగ్గిస్తాయి.లేకపోతె మిరియాలతో తయారు చేసిన చారు, లేదా పాలలో కాస్త మిరియాలు వేసి తీసుకుంటే సరి గొంతునొప్పి నుంచి ఇట్లే  బయటపడవచ్చు.మిరియాల పాలు  తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా సులువుగా తగ్గిపోతాయి.

గొంతు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా మంచిది అవి ఏమిటంటే.గొంతు నొప్పితో బాధపడేవారు పెరుగు తినకుండా ఉండడం చాలా మంచిది.

దగ్గు, గొంతు నొప్పి ఉన్న సమయంలో పెరుగు తీసుకుంటే ఆ వ్యాధి మరింత ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక దూరంగా ఉండాలి.అంతేకాకుండా గొంతు నొప్పితో బాధపడుతున్న సమయంలో చీజ్ వంటి ఫుడ్ తిసుకోకుండా ఉండటం చాలా మంచిది.

అలాగే సి విటమిన్ ఎక్కువగా లభించే నిమ్మ, ఉసిరి, ఆరెంజ్, నూనెలో వేయించిన పదార్థాలు కొన్ని రోజులపాటు తినకుండా ఉంటే గొంతు నొప్పి సమస్య నుంచి  బయటపడవచ్చు.

#Docters Help #Curd #Honey #Ginger #Health Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు