ఫ్లోరిడాకు పొంచివున్న ముప్పు: హరికేన్‌గా మారనున్న హమ్‌బర్టో తుఫాన్

డోరియన్ విలయ తాండవాన్ని ఇంకా మరచిపోకముందే మరో తుఫాను బహమాస్ దీవులపై విరుచుకుపడింది.దీనిని హమ్‌బర్టో తుఫానుగా అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ శాస్త్రవేత్తలు చెప్పారు.

 Tropical Storm Humberto Is Expected To Become A Hurricane In The Atlantic-TeluguStop.com

శనివారం తుఫానుగా ఉన్న హమ్‌బర్టో ఆదివారం రాత్రికి హరికేన్‌గా మారుతుందని.ఇది ప్రస్తుతం బహమాస్ దీవుల నుంచి అమెరికా తీరం వైపుగా కదులుతున్నట్లు హరికేన్ సెంటర్ తెలిపింది.

దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తీరాల్లో బీభత్సం సృష్టించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.హమ్‌బర్ట్ కారణంగా సముద్ర జలాల్లో ప్రాణాంతకమైన రిప్ కరెంట్ ఉత్పన్నమయ్యే ప్రమాదం వుందన్నారు.

మరోవైపు హమ్‌బర్ట్ కారణంగా బహమాస్, అబాకో దీవుల్లో సుమారు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి.

దీంతో డోరియన్ హరికేన్ శిథిలాల తొలగింపుతో పాటు సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది.

Telugu Abaco Islands, Hurricane, Tropical Storm-

కాగా హమ్‌బర్టో తుఫాను ఫ్లోరిడా తీరంవైపు దూసుకొస్తుండటంతో దానిని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.రెండు వారాల క్రితం అట్లాంటిక్ తీరంలో సంభవించిన డోరియన్ హరికేన్ కారణంగా బహమాస్‌లో 30 మంది మరణించగా.వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలడంతో ఇప్పటి వరకు అక్కడ అంధకారం నెలకొంది.వేలాది ఇళ్లు నేలమట్టం కావడంతో, 70 వేల మంది వరకు నిరాశ్రయులై ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube