స్టార్ హీరోయిన్ సమంతపై పెరుగుతున్న ఒత్తిడి.. పెదవి విప్పాలంటూ?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సమంత నాగచైతన్యల గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూనే రూమర్ల గురించి స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు.

 Trolls On Star Heroine Samantha About Nagachaitanya Issue,latest Tollywood News-TeluguStop.com

సమంత సోషల్ మీడియాలో పేరు మార్చినప్పటి నుంచి ఆమె గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది.సమంత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఈ విషయం గురించి స్ట్రెయిట్ గా రియాక్ట్ కావడం లేదు.

Telugu Nagachaitanya, Samantha, Trolls-Movie

సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత చెన్నై, గోవాకు వెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.మరోవైపు చైతన్యకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి సమంత ఎక్కువగా ఇష్టపడటం లేదు.సమంత పెదవి విప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా ఆ కామెంట్ల గురించి సమంత స్పందించడం లేదు.చైతన్య సమంతల బంధం విషయం అక్కినేని ఫ్యాన్స్ కు కన్ఫ్యూజన్ నెలకొంది.

అటు సమంత ఇటు చైతన్య పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కొత్త కొత్త సందేహాలు నెటిజన్లకు కలుగుతున్నాయి.తాజాగా సమంత సీనియర్ హీరోయిన్ త్రిష, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్ లతో కలిసి ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అక్కినేని హీరోల సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి మాత్రం పోస్టులు పెడుతుండటంతో కొంతమంది మాత్రం సమంతకు చైతన్యకు ఎలాంటి మనస్పర్థలు లేవని భావిస్తున్నారు.

Telugu Nagachaitanya, Samantha, Trolls-Movie

చైతన్య, సమంత కలిసి కనిపిస్తే మాత్రమే ఈ వార్తలు ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మరోవైపు చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా రిజల్ట్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చైతన్యకు జోడీగా లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube