శుభవార్త చెప్తే.. నీ భాషతో వాళ్లను కూడా చంపేస్తావా అంటూ కామెంట్?

Trolls On Manchu Lakshmi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Trolls On Manchu Lakshmi-TeluguStop.com

ఇక ఈయన వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న ఎంటర్ అయ్యారు.ఇదిలా ఉండగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

అదేవిధంగా ఈమె చేసే పలు వ్యాఖ్యలకి నెటిజెన్స్ చేతిలో దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంటారు.

 Trolls On Manchu Lakshmi-శుభవార్త చెప్తే.. నీ భాషతో వాళ్లను కూడా చంపేస్తావా అంటూ కామెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి శుభవార్త అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ఈమె త్వరలోనే ఒక తమిళ సినిమాలో నటించబోతున్నాననీ, తమిళంలో మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని,అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే తెలియజేస్తా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు నెటిజన్లు స్పందించి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ నీ తెలుగుభాష మాకే అర్థం కాక చస్తున్నాము మరి వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెడతారు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.అలాగే మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ గత కొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎన్నికలలో భాగంగా మా అధ్యక్ష పదవికి పోటీ చేసినటువంటి ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ అతని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మరి మీరు ఏ విధంగా తమిళ చిత్రాలలో నటిస్తున్నారు అంటూ ఈమె పై విరుచుకుపడ్డారు.ఏది ఏమైనా మంచు లక్ష్మి మరోసారి నెటిజన్ల చేతిలో దారుణంగా ట్రోల్ అవుతుందని చెప్పవచ్చు.

#TrollsManchu #Mohan Babu #Manchu Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube