మళ్లీ మహేష్‌ను ఏకి పారేస్తున్నారు  

  • సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో తెగ టార్గెట్‌ అవుతున్నాడు. ఈయన పదే పదే తమిళ సినిమాల గురించి స్పందిస్తున్న కారణంగా తెలుగు ప్రేక్షకులు ఈయన్ను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా మరోసారి మహేష్‌బాబుపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. మహేష్‌బాబు ఆమద్య సర్కార్‌, నవాబ్‌ చిత్రాలపై తాజాగా 2.ఓ చిత్రంపై స్పందించాడు. సినిమాలు చాలా బాగున్నాయంటూ తన అభిప్రాయంను చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే మహేష్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

  • Trolls On Mahesh Babu Tweet-Mahesh Tweet Sarkar Movie

    Trolls On Mahesh Babu Tweet

  • ఆ సినిమాలపై తన అభిప్రాయం చెబితే మహేష్‌ను ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు అనే అనుమానం రావచ్చు. అసలు విషయం ఏంటీ అంటే మహేష్‌ బాబు మొదటి నుండి కూడా తమిళ ప్రేమికుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు ఎక్కువగా తమిళ టెక్నీషియన్స్‌ను వాడుకోవడం, తమిళ దర్శకులతో ఈయన సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబర్చడం చేస్తూ ఉంటాడు. సరే అది ఆయన అభిప్రాయం అయ్యి ఉండవచ్చు. అదే సమయంలో మహేష్‌బాబు తెలుగు సినిమాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా అనేది కొందరి అభిప్రాయం.

  • Trolls On Mahesh Babu Tweet-Mahesh Tweet Sarkar Movie
  • అరవింద సమేత చిత్రం విడుదలైన సమయంలో మహేష్‌బాబు ఆ సినిమా గురించి మాట్లాడతాడని అంతా ఆశించారు. ఎన్టీఆర్‌ మరియు త్రివిక్రమ్‌లు తనకు మిత్రులు అయినా కూడా మహేష్‌బాబు మాత్రం ఆ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. అరవింద వచ్చిన కొన్ని రోజులకే వచ్చిన సర్కార్‌ చిత్రంపై ప్రశంసలు కురిపించి ట్వీట్‌ చేశాడు. దాంతో నందమూరి అభిమానులు తీవ్రంగా కోపగించుకుంటున్నారు. తాజాగా శంకర్‌పై అభిమానంతో, రజినీకాంత్‌ సినిమాపై స్పందించాడు. వరుసగా తమిళ సినిమాలనే పట్టించుకుంటున్న మహేష్‌బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఉన్నట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.