జాఫర్‌ ఎలిమినేషన్‌పై విమర్శలు, ఎథిక్స్‌ను ఫాలో అవ్వని తెలుగు బిగ్‌బాస్‌ టీం  

Trolls On Jafar Elimination In Bigg Boss-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నుండి రెండవ వారంలో జాఫర్‌ ఔట్‌ అయ్యాడు.టీవీ9 సీనియర్‌ రిపోర్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన జాఫర్‌ హౌస్‌లో కొంత కాలమే ఉంటాడని అంతా అనుకున్నారు.కాని మరీ రెండు వారాలే ఉంటాడని మాత్రం ఎవరు ఊహించలేదు.తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మొదటి వారంలో హేమ ఎలిమినేట్‌ అవ్వగా రెండవ వారంలో జాఫర్‌ ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది.జాఫర్‌ ఎలిమినేట్‌ అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి...

Trolls On Jafar Elimination In Bigg Boss--Trolls On Jafar Elimination In Bigg Boss-

Trolls On Jafar Elimination In Bigg Boss--Trolls On Jafar Elimination In Bigg Boss-

ఎలిమినేషన్‌లో ఉన్న 8 మందిలో అతి తక్కువ ఓట్లు జాఫర్‌కు అంటూ నాగార్జున ప్రకటించినప్పటికి కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు.ఎందుకంటే బిగ్‌బాస్‌ మాయ చేసి జాఫర్‌ను బయటకు పంపించాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

వితికకు అతి తక్కువ ఓట్లు పడ్డాయి.అయినా కూడా ఆమె ఒక స్టార్‌ అవ్వడంతో పాటు, వరుణ్‌ సందేశ్‌ భార్యగా ఆమె ఇంట్లో ఉంటే బాగుంటుందని, ప్రేక్షకులు ఎక్కువ ఎంటర్‌టైన్‌ అవుతారనే ఉద్దేశ్యంతో బిగ్‌బాస్‌ టీం భావించినట్లుగా తెలుస్తోంది.

ప్రేక్షకుల ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయానిన తీసుకుని జాఫర్‌ను ఎలిమినేట్‌ చేయడం విచారకరం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అసలు ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్‌ ఉండదు అని అంతా అంటూ ఉంటారు.

ఇప్పుడు జాఫర్‌ విషయంలో అలాగే జరిగింది.జాఫర్‌కు వితిక కంటే ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి.ఖచ్చితంగా వితికను ప్రేక్షకులు తిరష్కరించారు.

కాని బిగ్‌బాస్‌ టీం మాత్రం ఆమెనే ఉంచడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, బిగ్‌బాస్‌ కనీసం ఎథిక్స్‌ను ఫాలో అవ్వడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.