అనసూయ జబర్దస్త్‌కు గుడ్‌బై.. పుకార్లని నీటిమీద రాతలే అయ్యాయి   Trolls On Anchor Anasuya About Jabardast     2018-12-03   09:56:14  IST  Ramesh P

తెలుగు కామెడీ షో జబర్దస్త్‌ నుండి అనసూయ మరోసారి తప్పుకుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. జబర్దస్త్‌ ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన సమయంలో యాంకర్‌గా అనసూయను ఎంపిక చేయడం జరిగింది. అనసూయ తన అందంతో కామెడీ షోకు మసాలా జత చేసింది. అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చి అనసూయకు స్టార్‌ క్రేజ్‌ దక్కింది. అయితే కొంత కాలంకే అనసూయ జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పి వెళ్లి పోయింది. ఆమె స్థానంలో వచ్చిన రష్మి కూడా జబర్దస్త్‌కు మంచి యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించింది.

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి అనిపించుకుంటున్న సమయంలో అనసూయ మళ్లీ జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇద్దరు కలిసి రెండు ఎపిసోడ్స్‌ను హీట్‌ పుట్టించారు. అయితే ఈమద్య అనసూయ షోకు రాకపోవడంతో ఆమె తప్పుకుందనే వ్యాఖ్యలు, వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.

Trolls On Anchor Anasuya About Jabardast-Anchor Pradeep Rashmi Extra Jabardast Viral News

అనసూయ స్థానంలో మరో యాంకర్‌ వర్షిణి రావడంతో ఇక అనసూయ తప్పుకున్నట్లే అంటూ అంతా అనుకున్నారు. కాని తాజాగా అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లు నీటి మీద రాతలే అయ్యాయి.

Trolls On Anchor Anasuya About Jabardast-Anchor Pradeep Rashmi Extra Jabardast Viral News

యాంకర్‌ అనసూయ మళ్లీ జబర్దస్త్‌ షూటింగ్‌ లో పాల్గొంటుంది. సినిమాలతో కమిట్‌మెంట్స్‌ ఉన్న కారణంగా తాను కొన్ని వారాల పాటు జబర్దస్త్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. నిర్మాతల అనుమతి తీసుకుని తాను షోకు బ్రేక్‌ తీసుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

Trolls On Anchor Anasuya About Jabardast-Anchor Pradeep Rashmi Extra Jabardast Viral News

ఇకపై మళ్లీ బ్రేక్‌ రాకుండా చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చింది. జబర్దస్త్‌ వంటి బంగారు గుడ్డు పెట్ట బాతును ఎవరు వదులుకుంటారు చెప్పండి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.