ఏంటి షో చేయడం తగ్గించావ్ ఆఫర్స్ రావడం లేదా అంటూ అనన్య నాగళ్లపై ట్రోల్స్?

చిన్న హీరోయిన్లు అవకాశాల కోసం ఈమధ్య బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు.అయినా కూడా వారిని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు.

 Trolls On Ananya Nagalla For Not Getting Movie Offers Details,  Ananya Nagalla ,-TeluguStop.com

కారణం ఏంటంటే కొత్త హీరోయిన్స్ రావడంతో చిన్న హీరోయిన్లను మర్చిపోతున్నారు.అయినా కూడా ఏదో ఒక చిన్న ఆశతో గ్లామర్ షో చేస్తూ బాగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో ఒకరు అనన్య నాగళ్ల.

అనన్య నాగళ్ళ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

తన తెలంగాణ భాషతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ముఖ్యంగా తన అందంతో మాత్రం యువతను కట్టిపడేసి తన వైపు మలుపుకుంది.

అనన్య మొదటి సారి మల్లేశం సినిమాతో పరిచయం అయింది.ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా ఇందులో మల్లేశం పాత్రలో నటించాడు.

దీంతో ఆయనకు భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య.ఆ తర్వాత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది.ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో చేసింది.ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.

ఇక ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇప్పటికీ తను ఏ సినిమాలో నటిస్తుందో అన్న విషయం కూడా తెలియలేదు.అయితే మొదట్లో తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో బాగా పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.ముఖ్యంగా తన నడుము అందాలతో మాత్రం యువతను కన్నార్పకుండా చేస్తుంది.దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఇక ఈమె ఇంతలా గ్లామర్ షో చేయటంతో అవకాశాల కోసమే అని అర్థమవుతుంది.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీ ని అస్సలు పట్టించుకోవడం లేదు.అయితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ పంచుకోగా అందులో ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.అయితే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో వాటిని చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్ ఏంటి షో చేయడం తగ్గించావ్ ఆఫర్స్ రావడం లేదా అని కామెంట్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube