గంగ‌వ్వ విష‌యంలో మాటమార్చిన నాగార్జున.. అదే కార‌ణ‌మా?  

trolling on nagarjuna and gangavva! trolling, nagarjuna, gangavva, bigg boss, latest news, bigg boss 4 telugu, social media - Telugu Bigg Boss, Bigg Boss 4 Telugu, Gangavva, Latest News, Nagarjuna, Social Media, Trolling

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఇటీవ‌ల ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే.అయితే ఈ సీజ‌న్‌లో యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ మోస్ట్ స్పెష‌ల్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది.

TeluguStop.com - Trolling On Nagarjuna And Gangavva

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గంగ‌వ్వ త‌న‌దైన మాట‌ల‌తో మిగిలిన ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుంది.ఇక మొద‌టి వారం ఫుల్ జోష్‌గా ఉన్న గంగ‌వ్వ‌.

రెండో వారంలో మాత్రం ఢీలా ప‌డిపోయింది.

TeluguStop.com - గంగ‌వ్వ విష‌యంలో మాటమార్చిన నాగార్జున.. అదే కార‌ణ‌మా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆరోగ్యం బాగోలేద‌ని.

త‌న‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించండంటూ క‌న్నీరు పెట్టుకుంది గంగ‌వ్వ‌.దీంతో ఆమెకు హౌస్‌లోనే వైద్యం అందించారు.

ఇదిలా ఉంటే.గంగ‌వ్వ‌ను గురించి ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.వాస్త‌వానికి ఈమె వ‌య‌స్సు 61 ఏళ్లు.1959వ సంవత్సరంలో జూలై 25న గంగ‌వ్వ జ‌న్మించింది.ఇక బిగ్ బాస్ షోకు హోస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున్ వ‌య‌స్సు కూడా 61 ఏళ్లే.కానీ, 1959 ఆగష్టు 29న నాగార్జున జ‌న్మించారు.

అయితే వ‌య‌సులో పెద్ద వాడు నాగార్జున‌.గంగ‌వ్వ‌ను `అవ్వ‌` అని పిల‌వ‌డంపై సోష‌ల్ మీడియా పెద్ద చ‌ర్చ జ‌రిగింది.ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్లు నాగార్జున‌పై సెటైర్లు కూడా పేల్చారు.అయితే తాజాగా జ‌రిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున గంగ‌వ్వ విష‌యంలో మాటమార్చారు.శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో గంగ‌వ్వ‌ను కన్ఫెషన్ రూంకి పిలిచి నాగార్జున ఆరోగ్యం గురించి అడ‌గ‌గా.సూది మందు వేశారు, ఇప్పుడు బాగానే ఉందంటూ చెప్పుకొచ్చింది.

ఈ క్ర‌మంలోనే నాగ్ `గంగవ్వా నువ్ నన్ను అన్నా అన్నావ్.నువ్వు నా చెల్లెలివి.చెల్లెల్ని బాగా చూసుకునే బాధ్యత నాది` అని భరోసా ఇచ్చి పంపించారు.అయితే ఉన్న‌ట్టుండి గంగ‌వ్వ‌ను నాగార్జున చెల్లి అని పిల‌వ‌డానికి సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న‌ ట్రోలింగే కార‌ణ‌మంటున్నారు.

ట్రోలింగ్ వ‌ల్లే నాగార్జున గంగ‌వ్వ‌ను పిలిచే విధానంలో మాటమార్చార‌ని అంటున్నారు.ఏదేమైనా నాగార్జున, గంగవ్వ ఇష్యూ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

#Bigg Boss #Nagarjuna #Gangavva #Trolling #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trolling On Nagarjuna And Gangavva Related Telugu News,Photos/Pics,Images..