టాలీవుడ్ లో మాటల మాంత్రికుడుగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మధ్యకాలంలో కుటుంబ బంధాల చుట్టూ కథలు అల్లుకొని ఎక్కువ సక్సెస్ లు కొడుతున్న దర్శకుడు అంటే కచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది.
అయితే త్రివిక్రమ్ సినిమాలలో కనిపించే ఫ్యామిలీస్ నిజజీవితంలో చాలా తక్కువ ఉంటాయనేది విమర్శకుల మాట ఏది ఎలా ఉన్న టాలీవుడ్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ ఒకరుగా ఉన్నారు.స్టార్ దర్శకుడుగా తన హవా కొనసాగిస్తున్నారు.
అరవింద సమేత, అల వైకుంఠపురంలో తర్వాత నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ జూనియర్ ఎన్ఠీఆర్ తో స్టార్ట్ చేశారు.తమ హోమ్ బ్యానర్ అయినా హారికా హాసిని క్రియేషన్స్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది.
ఎన్ఠీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ చేసిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ లాక్ డౌన్ లో మరో పాన్ ఇండియా కథని సిద్ధం చేసాడని తెలుస్తుంది.తనకి అలవాటైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో యూనివర్శల్ కాన్సెప్ట్ గా ఈ కథని త్రివిక్రమ్ రెడీ చేసాడని టాక్.
ఈ కథ రామ్ చరణ్ కి కరెక్ట్ గా సరిపోతుందని తారక్ సూచించడంతో పాటు అతనికి కూడా చెప్పాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో మెగా ఫామిలీ హీరోలతో ఎలాగూ త్రివిక్రమ్ కి మంచి జర్నీ ఉంది కాబట్టి ఎన్ఠీఆర్ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమాని లైన్ లో పెట్టాలని అనుకుంటున్నారు.
ఇక త్రివిక్రమ్ తో సినిమా కోసం రామ్ చరణ్ కూడా ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు.ఈ నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్