త్రివిక్రమ్‌ భార్య గురించి ఆసక్తికర వార్త... మాటల మాంత్రికుడి ఫ్యాన్స్‌కు బూస్ట్‌ ఇచ్చే విషయం  

  • మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గురించి మినిమం సినిమా అవగాహణ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు. ఏ ఒక్కరు కూడా త్రివిక్రమ్‌ సినిమాలు అంటే మాకు ఇష్టం ఉండదు అనరు. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌, యూత్‌ ఆడియన్స్‌, మాస్‌ ఆడియన్స్‌ ఇలా అందరిని కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ భార్య గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆమె సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపించదు.

  • ఈమద్య కాలంలో త్రివిక్రమ్‌ భార్య ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి తప్ప అసలు అంతకు ముందు త్రివిక్రమ్‌కు పెళ్లి అయ్యిందా, ఆయన భార్య ఎవరు అనుకునే వారు. త్రివిక్రమ్‌ భార్య పేరు సౌజన్య. ఆమె ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి బందువుల అమ్మాయి. ఆమెకు స్వయంగా త్రివిక్రమ్‌తో పెళ్లి చేసింది శాస్త్రిగారు. పెళ్లికి ముందు నుండి కూడా సౌజన్య మంచి క్లాసికల్‌ డాన్సర్‌. అందుకే ఆమె తాజాగా వైజాగ్‌లో ఒక ప్రదర్శణ చేసింది.

  • Trivikram Wife Soujanya Enthralls Audience With Bharatanatyam-Kalabharathi

    Trivikram Wife Soujanya Enthralls Audience With Bharatanatyam

  • స్టార్స్‌ భార్యలు పెద్దగా స్టేజ్‌ షోలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించరు. కాని త్రివిక్రమ్‌ భార్య అభిరుచిని గ్రహించి తాజాగా వైజాగ్‌లోని కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సౌజన్యతో ప్రదర్శణ ఇప్పించారు. ఈ కార్యక్రమంకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరు అవ్వడంతో పాటు సీతారామ శాస్త్రీ, త్రివిక్రమ్‌ ఇంకా కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం చాలా పెద్ద హిట్‌ అయ్యిందని, సౌజన్య గారి డాన్స్‌తో మా కళాభారతి కార్యమ్రం సక్సెస్‌ అయ్యిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.