తారక్‌కు అదిరిపోయే ఝలక్ ఇచ్చిన త్రివిక్రమ్  

Trivikram To Do Medium Range Movie Befor Ntr Movie - Telugu Ntr, Rrr, Telugu Movie News, Tollywood Gossips, Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల డైరెక్ట్ చేసిన అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.

Trivikram To Do Medium Range Movie Befor Ntr Movie - Telugu Ntr, Rrr, Telugu Movie News, Tollywood Gossips, Trivikram-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అటు తారక్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాను తొలుత జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జనవరి 8కి వాయిదా వేశారు.

దీంతో తారక్ జనవరి నెల పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండడు.ఇక చేసేదేమీ లేక త్రివిక్రమ్ ఈ మధ్యలో ఓ మీడియం రేంజ్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.

ఓ చిన్న హీరోను పెట్టి ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో తెరకెక్కించి రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడు.అయితే ఈ సినిమా త్రివిక్రమ్ ఎవరితో తెరకెక్కిస్తాడు, ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనే అంశాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఏదేమైనా తారక్‌తో సినిమా కంటే ముందే త్రివిక్రమ్ మరో సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేస్తాడా లేడా అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు

Trivikram To Do Medium Range Movie Befor Ntr Movie-rrr,telugu Movie News,tollywood Gossips,trivikram Related....