యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్టైనర్గా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాతో మరోసారి ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునేందుకు తారక్-త్రివిక్రమ్ కాంబో రెడీ అవుతోంది.ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిడ్ రెడీ అవుతున్నారు.
అయితే ప్రతిసారి త్రివిక్రమ్ కమర్షియల్ అంశాలను పుష్కలంగా వాడుతుంటాడు.కానీ ఈసారి కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇచ్చేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.
తన పంథాకు పూర్తి భిన్నంగా ఈసారి తారక్ కోసం త్రివిక్రమ్ తీయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక ఈ సినిమాలో తారక్ లుక్ పరంగా కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సినిమాలో ఫ్యామిలీ అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారా, అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఏదేమైనా తారక్ కోసం త్రివిక్రమ్ తన పంథా మార్చుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.