త్రివిక్రమ్ ఈసారి అది కూడా తెస్తున్నాడట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

 Trivikram, Ntr, Ntr30, Kalyan Ram, Pooja Hegde-TeluguStop.com

ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను లాంఛ్ చేసిన తారక్, త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు.ఇక తారక్‌తో గతంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్, ఆ సినిమాలో కామెడీని పూర్తిగా పక్కనబెట్టాడు.

కేవలం సీరియస్ మూవీగా వచ్చిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది.ఇక ఇప్పుడు తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రానున్న సినిమాలో పూర్తి స్థాయి కామెడీని త్రివిక్రమ్ అందించనున్నాడు.

ఇక ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్థినకు అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, రష్మిక మందన్నలను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నారు.మరి ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎలాంటి కామెడీతో నవ్విస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube