త్రివిక్రమ్ సినిమా తారక్‌కు రెండో ఆప్షన్ అట!  

Trivikram Story Is Second Option For NTR, Trivikram, NTR, NTR30, Tollywood News - Telugu Ntr, Ntr30, Tollywood News, Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ మూవీని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Trivikram Story Is Second Option For Ntr

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను లాంఛ్ కూడా చేశారు చిత్ర యూనిట్.

TeluguStop.com - త్రివిక్రమ్ సినిమా తారక్‌కు రెండో ఆప్షన్ అట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కోసం తొలుత త్రివిక్రమ్ రెండు కథలను రాసుకున్నాడట.అయితే మొదట ఓ కథను వినిపించగా, తారక్‌కు అది నచ్చలేదట.

దీంతో రెండో కథను త్రివిక్రమ్ వినిపించగా, దాన్ని ఓకే చేశాడట.ఇలా ‘అయినను పోయిరావలె హస్తినకు’ చిత్రాన్ని తారక్ ఓకే చేశాడని తెలుస్తోంది.

మరి త్రివిక్రమ్ రాసుకున్న తొలి కథను ఎవరికి వినిపిస్తాడా, అందులో హీరోగా ఎవరు నటిస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, తారక్ ఇందులో పొలిటిక్ బ్యాక్‌డ్రాప్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోండగా, అందులో పూజా హెగ్డే, జాన్వీ కపూర్‌ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమాలో తారక్‌తో ఎవరు రొమాన్స్ చేస్తారో చూడాలి.

ఇక అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాతే త్రివిక్రమ్ చిత్రంలో నటించాలని భావిస్తున్నాడట.

#Trivikram #NTR30

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trivikram Story Is Second Option For Ntr Related Telugu News,Photos/Pics,Images..