2020 లో త్రివిక్రమ్‌ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న చిత్రం చేయనున్నాడట!  

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మొన్నటి దసరాకు ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘అరవింద సమేత’ చిత్రంతో వచ్చి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. దాదాపుగా 85 కోట్ల షేర్‌ను ఆ చిత్రం రాబట్టి ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచింది. అరవింద సమేత చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ చేయబోతున్న మూవీ ఇప్పటికే ఖరారు అయ్యింది. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఇక ప్రతి స్టార్‌ డైరెక్టర్‌ కూడా మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయాలని కోరుకుంటాడు. అలాగే త్రివిక్రమ్‌ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చాలా కాలంగా ఆశ పడుతున్నాడట.

Trivikram Srinivas To Direct Megastar Chiranjeevi-Megastar Chiranjeevi

Trivikram Srinivas To Direct Megastar Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే పూర్తి కాబోతుంది. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత బోయపాటి మూవీని కూడా చిరంజీవి లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీని చేసేందుకు చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడంటూ సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

Trivikram Srinivas To Direct Megastar Chiranjeevi-Megastar Chiranjeevi

భారీ అంచనాలున్న బన్నీ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ చేయబోతున్న మూవీ ఏంటీ అనే విషయమై క్లారిటీ రాలేదు. కాని 2020 ద్వితీయార్థంలో చిరంజీవిని త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేయబోతున్నాడనే టాక్‌ మాత్రం వినిపిస్తుంది. 2020లో షూటింగ్‌ ప్రారంభించి, 2021లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా స్టోరీ లైన్‌ కూడా ఓకే కాలేదు. అయితే చరణ్‌ ఇటీవలే తన తండ్రితో సినిమా చేయాల్సిందిగా త్రివిక్రమ్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. ఇంకా చాలా సమయం ఉంది కనుక పూర్తి వివరాలు ఇప్పట్లో వెళ్లడయ్యే అవకాశం లేదు.