ఎన్టీఆర్ కోసం కియారాని సంప్రదిస్తున్న మాటల మాంత్రికుడు  

Bollywood beauty kiara advani contacted for NTR movie, Trivikram srinivas, Tarak, Tollywood, Telugu cinema, Nandamuri Fans - Telugu Bollywood Beauty Kiara Advani Contacted For Ntr Movie, Nandamuri Fans, Tarak, Telugu Cinema, Tollywood, Trivikram Srinivas

ఈ జెనరేషన్ కి ఫ్యామిలీ కథలలో ఉండే అందం, బలం చూపిస్తూ అనుబంధాలని పదే పదే గుర్తు చేస్తూ సినిమాలు చేస్తున్న దర్శకుడు అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్.ఒక్కో దర్శకుడుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ అనుబందాలలోనే అన్ని రకాల ఎమోషన్స్ ని ఆవిష్కరిస్తాడు.

 Trivikram Srinivas Tarak Kiara Advani

అజ్ఞాతవాసితో ఫ్లాప్ కొట్టిన తరువాత వెంటనే అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో సాలిడ్ హిట్స్ ని ఖాతాలో వేసుకొని తనకి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు.మళ్ళీ ఎన్టీఆర్ తోనే సినిమా ప్లాన్ చేశాడు.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫినిష్ అయ్యింది.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దానిని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.

ఎన్టీఆర్ కోసం కియారాని సంప్రదిస్తున్న మాటల మాంత్రికుడు-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ టీం చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలో ఇందులో నటించే కథానాయిక పాత్ర విషయమై ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

మొన్నటి వరకు పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపించింది, తరువాత జాన్వీ కపూర్ పేరు కూడా పరిశీలించారు.అయితే ఇప్పుడు తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో మెరిసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వానీ పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం కియరాతో ఈ చిత్రం బృందం సంప్రదింపులు జరుపుతోందట.కబీర్ సింగ్ తర్వాత కియరా అద్వానీ ఇమేజ్ బాలీవుడ్ లో ఒక్కసారిగా పెరిగిపోయింది.అక్కడ ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కియరా ఉంది.అయితే ఆమె తెలుగు సినిమాలకి కూడా తన ప్రాధాన్యత ఉంటుందని గతంలో ప్రకటించడంతో త్రివిక్రమ్ ఆమె కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని చిత్రపురిలో చర్చించుకుంటున్నారు.

#Tarak #Nandamuri Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trivikram Srinivas Tarak Kiara Advani Related Telugu News,Photos/Pics,Images..