యాంకర్ సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. హెచ్చరించిన ప్రముఖ డైరెక్టర్?

సాధారణంగా ఒక భాషకు చెందిన హీరోయిన్లు, యాంకర్లు మరో భాషను మాట్లాడటం తేలిక కాదు.అయితే బుల్లితెర యాంకర్ సుమ మాత్రం తెలుగులో చాలా సంవత్సరాల నుంచి యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తూ స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 Trivikram Srinivas Shocking Comments About Star Anchor Suma, Pre Release Event,-TeluguStop.com

దాదాపు 15 సంవత్సరాల నుంచి బుల్లితెర యాంకర్ గా, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హోస్ట్ గా సుమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఈవెంట్లకు యాంకర్ గా సుమకే ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.

స్టేజ్ పై సుమ మాట్లాడే సమయంలో తన మాటలు, పంచ్ లు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయనడంలో సందేహం అవసరం లేదు.తాజాగా ఇచ్చట వాహనములు నిలపరాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ వెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యారు.

సుమ యాంకర్ అని సమాచారం అందితే మెగాస్టార్ చిరంజీవి ముందే ప్రిపేరై వస్తారని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

Telugu Suma, Chiranjeevi, Pre, Anchor-Movie

చిరంజీవి గారి వల్ల కూడా సుమను డీల్ చేయడం కాలేదని సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.సుమ మంచి మాటకారి అని ఏఎన్నార్ మాత్రమే సుమను హ్యాండిల్ చేయగలరని త్రివిక్రమ్ తెలిపారు.పబ్లిక్ వేదికలపై మాట్లాడటం తేలికైన విషయం కాదని వేల సంఖ్యలో జనాలు ఉన్న సమయంలో మాట్లాడాలంటే గట్స్ ఉండాలని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

Telugu Suma, Chiranjeevi, Pre, Anchor-Movie

స్టేజ్ పై జనాలను ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడటం సుమకు మాత్రమే సాధ్యమని కరోనా తర్వాత తాను పాల్గొన్న తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇచ్చట వాహనములు నిలపరాదు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్లు చేశారు.సుశాంత్ ఈ మూవీతో హిట్ సాధిస్తాడో లేదో చూడాల్సి ఉంది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube