మెగాస్టార్ కోసం కథని రెడీ చేస్తున్న త్రివిక్రమ్... మరి చిరు ఏమంటాడో....  

Trivikram Srinivas Script Ready For Megastar Chiranjeevi Movie - Telugu Chiranjeevi Movie, Trivikram Srinivas Movie With Chiranjeevi, Trivikram Srinivas Movie With Chiranjeevi Nes, Trivikram Srinivas Script News,, Latest News

టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్నటువంటి దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఇటీవలె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించినటువంటి అల వైకుంఠ పురములో చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

 Trivikram Srinivas Script Ready For Megastar Chiranjeevi Movie

అంతే కాక ఈ చిత్రం ఇతర దేశాల్లో కూడా పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సినీ కెరీర్ లోనే ది బెస్ట్ నిలిచింది.అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఓ వార్త నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి ఓ కథలు రెడీ చేస్తున్నట్లు, ఈ కథ పూర్తిగా కామెడీ ఎంటర్టైనింగ్ తరహాలో ఉన్నట్లు పలు వార్తలు నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక ఇప్పటికే ఈ కథను మెగాస్టార్ చిరంజీవికి కూడా వినిపించడంతో మెగాస్టార్ కూడా అందులో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ కోసం కథని రెడీ చేస్తున్న త్రివిక్రమ్… మరి చిరు ఏమంటాడో….-Latest News-Telugu Tollywood Photo Image

ఏదేమైనప్పటికీ మెగాస్టార్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే అప్పుడే మెగా అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న టువంటి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ పూర్తవగానే మెగాస్టార్ చిరంజీవితో  త్రివిక్రమ్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు పలువురు ఇప్పటికే గుసగుసలాడుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.అంతేకాక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపాడు.

మరి ఈ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా అయ్యే పనేనా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.అయితే మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trivikram Srinivas Movie With Chiranjeevi,trivikram Srinivas Movie With Chiranjeevi Nes,trivikram Srinivas Script News,trivikram Srinivas Script Ready For Megastar Chiranjeevi Movie,trivikram Srinivas Script Ready For Megastar Chiranjeevi Movie Latest News- Related....