అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో ఎంట్రీ కంటే ముందుగానే సెలబ్రెటీ గుర్తింపు వచ్చేసింది.ఆమె పార్టీలకి వెళ్లిన, ఫ్రెండ్స్ తో బయటకి వెళ్లిన జాన్వీ కపూర్ మీద స్పెషల్ గా మీడియా ఫోకస్ ఉండేది.
ఇక మొదటి సినిమా ధఢక్ తో జాన్వీ కపూర్ నటిగా ప్రూవ్ చేసుకుంది.అదే సమయంలో శ్రీదేవి కూడా మరణించింది.
ఆ తరువాత జాన్వీ కపూర్ లోనే అందరూ శ్రీదేవిని చూస్తున్నారు.ఆమె నటనని శ్రీదేవితో పోల్చి చూస్తున్నారు.
మొదటి సినిమాకే ఆమె మీద భారీ అంచనాలు ఏర్పడిన ఆ సినిమా హిట్ తో వాటిని కొంత వరకు అందుకుంది.ఇక రెండో ప్రయత్నంగా గుంజన్ సక్షేనా బయోపిక్ తో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.
విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.అయితే సినిమా మీద సుశాంత్ ఫ్యాన్స్ ప్రభావం బాగా పడటంతో కాస్తా నెగిటివిటీ వచ్చింది.
ఇదిలా ఉంటే ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీదేవి కూతురుగా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కావాలని జాన్వీ ఆశ పడుతుంది.
అందుకు తగ్గట్లుగానే ఆమెకి తొలి చిత్రం చేసే అవకాశం వస్తుందని టాక్ నడుస్తుంది.అది కూడా ఎన్‌టిఆర్ లాంటి స్టార్ హీరోకి జోడీగా కావడం విశేషం.ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు.దీనికి సంబంధించిన స్క్రిప్టు ఇప్పటికే రెడీ అయింది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది.
ఇందులో కథానాయిక పాత్రకు జాన్వీని తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట.దాంతో ప్రస్తుతం డేట్స్ విషయంలో ఆమెతో నిర్మాతలు సంప్రదింపులు జరుగుతున్నారని తెలుస్తుంది.
ఎన్‌టిఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ చూస్తే ఒకప్పటి సీనియర్ ఎన్‌టిఆర్, శ్రీదేవి కాంబినేషన్ ప్రేక్షకులకి గుర్తుకొస్తుందని, ఇది సినిమాకి అదనపు మైలేజ్ ఇస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.