ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్లుగా ఆ ఇద్దరు ఖరారైనట్లే  

Trivikram Srinivas Finalized Ketika sharma For NTR, Tollywood, Telugu Cinema, Bollywood, Jr NTR, Keerthi Suresh, RRR Movie - Telugu Bollywood, Jr Ntr, Keerthi Suresh, Ketika Sharma, Rrr Movie, Telugu Cinema, Tollywood, Trivikram Srinivas

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్ఠీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని త్రివిక్రమ్ ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరహాలో కాకుండా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

TeluguStop.com - Trivikram Srinivas Finalized Ketika Sharma For Ntr

అయినా పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని ఈ సినిమాకి ఖరారు చేసినట్లు టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే తారక్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.ఈ నేపధ్యంలో క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడు.

TeluguStop.com - ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్లుగా ఆ ఇద్దరు ఖరారైనట్లే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో ఎప్పటిలాగే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లుని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

అందులో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చేశాడని బోగట్టా.మొన్నటి వరకు పూజాహెగ్డే పేరు ప్రముఖంగా వినిపించింది.అయితే పూజా పాప బాలీవుడ్ ఓ మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.

ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ ని ఖరారు చేసినట్లు సమాచారం.ఇక సెకండ్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా చేస్తున్న రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కేతిక శర్మని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

కథ ప్రకారం సినిమాలో కాస్తా మోడరన్ క్యారెక్టర్ ఉండటం వలన కేతిక శర్మ అయితే కొత్త పేస్ అలాగే రొమాంటిక్ సన్నివేశాలకి ఒకే చెప్పడంతో ఆమెని ఖరారు చేసినట్లు సమాచారం వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

#Keerthi Suresh #Ketika Sharma #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trivikram Srinivas Finalized Ketika Sharma For Ntr Related Telugu News,Photos/Pics,Images..