గురూజీ ఆ అద్బుతాలు ఎక్కడ ఆవిష్కరిస్తాడో తెలుసా?  

Trivikram Srinivas Comments About His Script Writing-script Writing,trivikram And Family,trivikram Latest Interview,trivikram Punch Line,trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్బంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

Trivikram Srinivas Comments About His Script Writing-script Writing,trivikram And Family,trivikram Latest Interview,trivikram Punch Line,trivikram Srinivas Telugu Tollywood Movie Cinema Film Latest Ne-Trivikram Srinivas Comments About His Script Writing-Script Writing Trivikram And Family Latest Interview Punch Line

ముఖ్యంగా స్క్రిప్ట్‌ రైటింగ్‌ విషయంలో తాను తీసుకునే జాగ్రత్తలు ఏంటీ అనే విషయమై త్రివిక్రమ్‌ ఈసారి చాలా క్లారిటీగా మాట్లాడాడు.చాలా మందికి ఉన్న అనుమానాలు క్లియర్‌ చేశాడు.

పలువురు దర్శకులు స్క్రిప్ట్‌ వర్క్‌ కోసం విదేశాలకు వెళ్లడం లేదంటే అరకు మరియు ఇతరత్ర ప్రాంతాలకు ప్రశాంతతకు వెళ్తారు.పూరి స్క్రిప్ట్‌ వర్క్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్తూ ఉంటాడు.

అలాంటిది త్రివిక్రమ్‌ సిటీ శివారు ప్రాంతంకు కూడా వెళ్లడట.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.తాను స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తిగా ఇంట్లోనే చేస్తాడట.అది కూడా ఇంట్లో పిల్లలు మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న సమయంలోనే రాసుకుంటూ ఉంటాడట.

త్రివిక్రమ్‌ స్పెషల్‌గా రూంలో కూర్చుని తలుపు బిగించుకుని స్క్రిప్ట్‌ రాయడట.స్క్రిప్ట్‌ రాస్తున్న సమయంలో పిల్లలు వచ్చి డిస్ట్రబ్‌ చేసినా మరేం చేసినా కూడా ఆయన మాత్రం డిస్ట్రబ్‌ కాకుండా స్క్రిప్ట్‌ను రాసుకుంటానని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి ఇలా సహజ వాతావరణంలో రాసుకోవడం వల్లే ఆయన సినిమాలోని సీన్స్‌ చాలా సహజంగా ఉంటాయని జనాలు అంటున్నారు.

తాజా వార్తలు