త్రివిక్రమ్‌, విజయ్‌ దేవరకొండ కాంబో ఇలా మిస్‌ అయ్యింది  

  • మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తాజాగా అరవింద సమేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజ్ఞాతవాసి ఫ్లాప్‌కు ప్రతీకారం అన్నట్లుగా అరవింతతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. త్వరలో అల్లు అర్జున్‌తో సినిమాకు త్రివిక్రమ్‌ సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలోనే విజయ్‌ దేవరకొండ మరియు త్రివిక్రమ్‌ల కాంబో గురించి సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నందిని రెడ్డి ఒక కథతో వీరిద్దరి కాంబినేషన్‌ను సెట్‌ చేసేందుకు ప్రయత్నించిందట. కాని కొన్ని కారణాల వల్ల ఆ మూవీ పట్టాలెక్కలేదని సమాచారం అందుతుంది.

  • Trivikram Srinivas And Vijaya Devarakonda Movie Missed For This Reason-

    Trivikram Srinivas And Vijaya Devarakonda Movie Missed For This Reason

  • అర్జున్‌ రెడ్డి విడుదలైన సమయంలో నందిని రెడ్డి ఒక కథతో విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమా చేయాలని భావించింది. కథను సిద్దం చేసుకుని, స్క్రీన్‌ప్లేను కూడా రాసుకుంది. ఆ కథను విజయ్‌ దేవరకొండకు అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ వద్దకు వెళ్లి నిర్మాణ భాగస్వామి కావాలని సూచించింది. ఈ ప్రాజెక్ట్‌ మీరైనా టేకోవర్‌ చేయండి అంటూ కోరిందట. అందుకు త్రివిక్రమ్‌ సున్నితంగా తిరష్కరించాడు. ఆ ప్రాజెక్ట్‌లో ఇద్దరు హీరోలు ఉంటే బాగుంటుంది. కథానుసారంగా ఇంకా మార్పులు చేసి, హీరోలు ఇద్దరుగా మార్చితే బాగుంటుందంటూ నందిని రెడ్డికి సలహా ఇచ్చాడట.

  • Trivikram Srinivas And Vijaya Devarakonda Movie Missed For This Reason-
  • త్రివిక్రమ్‌ సలహాను పట్టించుకోకుండా మరో చోటకు ఆమె ఈ ప్రాజెక్ట్‌ను తీసుకు వెళ్లింది. అక్కడ కూడా చేదు అనుభవమే మిగిలింది. దాంతో ఆమె చివరకు తన వద్ద ఉన్న కథను త్రివిక్రమ్‌ చెప్పినట్లుగా మార్చి ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ మాదిరిగా చేసేందుకు సిద్దం అవుతుంది. వెబ్‌ సిరీస్‌ లకు ఈమద్య కాలంలో మంచి డిమాండ్‌ ఉంది. అందుకే తప్పకుండా ఈ వెబ్‌ సిరీస్‌ నందిని రెడ్డికి అవకాశం తెచ్చి పెడుతుందో చూడాలి. నందిని రెడ్డి మొదటే త్రివిక్రమ్‌ చెప్పిన మార్పులకు ఓకే చెప్పే, విజయ్‌ దేవరకొండ, త్రివిక్రమ్‌ కాంబోలో మూవీ పట్టాలెక్కి ఉండేదేమో అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.