మాటల మాంత్రికుడు క్లబ్ లోకి వస్తున్న సూపర్ స్టార్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో సినిమాతో తాజాగా మరో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

 Trivikram Srinivas And Mahesh Babu Plan To Movie-TeluguStop.com

ఈ సినిమాని అఫీషియల్ గా ఇప్పటికే ప్రకటించారు.ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది.

అయితే త్రివిక్రమ్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు.

ఈ రెండు సినిమాలో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న ఇప్పటికి కూడా టీవీలో ప్రసారం అయిన ప్రతి సారి ఆకట్టుకుంటూ ఉంటాయి.

ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు అని వినిపిస్తుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం మరో ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నారు.అయితే మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అదిరిపోయే ఎంటర్టైనర్ కథాంశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుకి ఓ ఇంటరెస్టింగ్ కథ చెప్పాడని, దానికి మహేష్ కూడా గ్ర్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.మొదటి రెండు సినిమాలు తరహాలో కాకుండా ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని ఇద్దరు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అందుకే ఈ సారి డిఫరెంట్ జోనర్ ట్రై చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube