గుప్త నిధుల కోసం వేట మొదలు పెట్టిన జూ. ఎన్టీఆర్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికీ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కాల కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

 Trivikram Srinivas And Jr Ntr Combination Movie News Update-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా గుప్త నిధుల తవ్వకాల అక్రమాలను బట్టబయలు చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

 Trivikram Srinivas And Jr Ntr Combination Movie News Update-గుప్త నిధుల కోసం వేట మొదలు పెట్టిన జూ. ఎన్టీఆర్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక ఈ చిత్రంలో ఇద్ద రు హీరోయిన్లు  నటిస్తుండగా ఇందులో ఒక హీరోయిన్ గా సమంత అక్కినేని ని తీసుకున్నట్లు సమాచారం.అయితే  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంతకాలం పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిత్రీకరణ పనులను వాయిదా వేశారు.

మరి అనుకున్న సమయానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తాడో లేదో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూ.ఎన్టీఆర్  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.

అయితే ఇటీవలే కేజిఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్.

#Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు