ఇలాంటి పనులు చేయాలంటే త్రివిక్రమ్‌ తప్ప మరెవ్వరు చేయలేరు  

To Do Such Things, Except For Trivikram, No One Can Not Do It Again-allu Arjun,pooj Hegde,sarileru Nikevvaru,trivikram,trivikram Srinias

సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.బన్నీ కెరీర్‌లో టాప్‌ చిత్రాల జాబితాలో నిలవడంతో పాటు మరో రెండు మూడు రోజుల్లో నెం.1 చిత్రంగా కూడా నిలవడం ఖాయం అయ్యింది.బన్నీ రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం ఆయనకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది.

To Do Such Things, Except For Trivikram, No One Can Not Do It Again-allu Arjun,pooj Hegde,sarileru Nikevvaru,trivikram,trivikram Srinias -To Do Such Things Except For Trivikram No One Can Not It Again-Allu Arjun Pooj Hegde Sarileru Nikevvaru Trivikram Srinias

ఇక ఈ చిత్రంతో అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ల జోడీ హ్యాట్రిక్‌ దక్కించుకుంది.గత కొంత కాలంగా త్రివిక్రమ్‌ కు కూడా మంచి సక్సెస్‌ లేదు.

అది దీంతో నెరవేరింది.

అల్లు అర్జున్‌ను చాలా విభిన్నంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు.

ఇక ఈ చిత్రంలో సితరాల సిరపడు అనే పాట ఉంది.ఆ పాట ఆంధ్రా యాసతో సాగుతుంది.పాట చాలా విభిన్నంగా ఉండటంతో మొదటి నుండి కూడా ఆసక్తి నెలకొంది.సినిమాలో ఆ పాటను చూసి అంతా అవాక్కవుతున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.అసలు ఇలాంటివి మరెవ్వరైనా చేయగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

సితరాల సిరపడు అనే పాటను చాలా స్టైలిష్‌గా ఒక యాక్షన్‌ సన్నివేశంతో డిజైన్‌ చేశారు.పాటను కళాత్మకంగా రూపొందించడం ఒక ఎత్తు అయితే ఆ పాటలో చాలా వినూత్నంగా ఫైట్‌ను పెట్టడం మరో హైలైట్‌.

ఈ పాటలో ఆ ఫైట్‌ను జత చేసి చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.అసలు పాటలో ఫైట్‌ను పెట్టాలనే ఆలోచన రావడం చాలా గ్రేట్‌ విషయం అంటున్నారు.

మొత్తానికి అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్‌ అవ్వడానికి అదో కారణంగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు

To Do Such Things, Except For Trivikram, No One Can Not Do It Again-allu Arjun,pooj Hegde,sarileru Nikevvaru,trivikram,trivikram Srinias Related....