సంక్రాంతి డైరెక్టర్స్‌ వార్‌లో గెలిచింది ఎవరంటే!  

Who Won The Wall Of Directors\' War!-anil Raipudi,directors\\' War,sarileru Nikevvaru,trivikram Srinias,సంక్రాంతి డైరెక్టర్స్‌

సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినా కూడా దర్బార్‌ మరియు ఎంత మంచివాడవురా చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు.కాని సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రాలు మాత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తున్నాయి.

Who Won The Wall Of Directors' War!-Anil Raipudi Directors\\' War Sarileru Nikevvaru Trivikram Srinias సంక్రాంతి డైరెక్టర్స్‌

ఎవరికి వారు తమ సినిమా విన్నర్‌ అంటే తమ సినిమా విన్నర్‌ అంటూ సంక్రాంతి విన్నర్‌గా ప్రకటించుకుంటున్నారు.కాని విశ్లేషకులు మాత్రం రెండు సినిమాలు కూడా సంక్రాంతి విన్నర్స్‌ అంటూ చెబుతున్నారు.

రెండు సినిమాలు సంక్రాంతి విన్నర్‌ ఓకే కాని, రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుల్లో ఎవరు సంక్రాంతి విన్నర్‌ అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాగా ఆడుతుంది.

అందుకు ప్రధాన కారణం మహేష్‌బాబు మరియు విజయశాంతి.ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ ఎక్కువ శాతం వారికే దక్కుతుంది.

కనుక సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌ దర్శకుడు అనీల్‌ రావిపూడికి దక్కేది తక్కువే.

ఇక అల వైకుంఠపురంలో చిత్రంలో నటించిన అల్లు అర్జున్‌ కంటే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన గురూజీ త్రివిక్రమ్‌కే ఎక్కువ సక్సెస్‌ క్రెడిట్‌ దక్కుతుంది.ఆయన అద్బుతమైన మ్యాజిక్‌ చేశాడు అంటూ అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.తప్పకుండా ఇదో అద్బుతమైన చిత్రం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

త్రివిక్రమ్‌ మార్క్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉందని దర్శకుడిపైనే ప్రశంసలు కురిపిస్తున్నారు.కనుక సంక్రాంతికి వచ్చిన నలుగురు దర్శకుల్లో త్రివిక్రమ్‌ విన్నర్‌ అంటూ అంతా అంటున్నారు.

తాజా వార్తలు