సమంత రేంజ్ పెరిగేలా త్రివిక్రమ్ షాకింగ్ స్కెచ్.. ఏమిటంటే?

Trivikram Shocking Sketch To Increase Samantha Range Do You Know What Is It

టాలీవుడ్ బ్యూటీ సమంత విడాకుల తర్వాత కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించింది.ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

 Trivikram Shocking Sketch To Increase Samantha Range Do You Know What Is It-TeluguStop.com

ఇదిలా ఉంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సమంత యశోద మూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా సమంత కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక వైవిద్యభరితమైన కథను సిద్ధం చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో చివరిసారిగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అయింది.

 Trivikram Shocking Sketch To Increase Samantha Range Do You Know What Is It-సమంత రేంజ్ పెరిగేలా త్రివిక్రమ్ షాకింగ్ స్కెచ్.. ఏమిటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు కావస్తున్నా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా రాలేదు.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఇక త్రివిక్రమ్,మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అనుకున్నప్పటికీ, ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు.అంతే కాకుండా ఎన్టీఆర్ తో కూడా త్రివిక్రమ్ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు అని వార్తలు వినిపించాయి.

కానీ ఆ సినిమా కూడా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో సినిమాలు చేయాలి అంటే ఇంకా టైం పట్టొచ్చు అని భావించే, ఆ లోపు సమంతతో ఒక ప్రాజెక్టును ఫినిష్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు త్రివిక్రమ్.

Telugu Samantha, Tollywood, Trivikram-Movie

ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను సమంత తో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించిన సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే త్వరలోనే సమంత ను కలిసి కథను వినిపించబోతున్నారని తెలుస్తోంది.మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్టు అయిన ఓకే అవుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

#Samantha #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube