త్రివిక్రమ్ సెంటిమెంట్ కు ఆశ్చర్యపోతున్న సినీ జనాలు..

Trivikram Sentiments Will Shock You , Trivikrem, Director, Panjagutta, Hyderabad, Tollywood , Social Media

ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.అలాగే మాటల మాంత్రికుడు.

 Trivikram Sentiments Will Shock You , Trivikrem, Director, Panjagutta, Hyderabad-TeluguStop.com

సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది.తన సినీ కెరీర్ కు ప్రాణం పోసిన ఒకప్పటి తన రూంను ఆయన ఇప్పటికీ మర్చిపోలేదు.

గడిచిన 20 సంవత్సరాలుగా ఆ గదికి తాను రెంట్ చెల్లిస్తూనే ఉన్నాడట.ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కు వచ్చిన తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడట.రూంకు రెంట్ కట్టే పరిస్థితిలో కూడా ఆయన లేడట.కమెడియన్ సునీల్ తో కలిసి పంజాగుట్టలో ఓ చిన్న అద్దె రూంలో ఉండేవాట.

ఆ రూంలో ఉండగానే తనకు సినిమా అవకాశాలు వచ్చాయట.రచయితగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడట.

ఈ రోజు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా చెలామణి అదుతున్న త్రివిక్రమ్ కు సినీ ఓనమాలు నేర్పింది ఆ రూమేనట.అందుకే ఆయనకు ఆ రూం అంటే ఎంతో ఇష్టమట.గడిచిన 20 సంవత్సరాలుగా ఆ రూంకు నెలకు రూ.5 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నాడట.తను ఎక్కడున్నా.మర్చిపోకుండా నెలకు అద్దె ఓనర్ కు అందేలా చేస్తున్నాడట.దర్శకుడు త్రివిక్రమ్ సెంటిమెంట్ ను ఆయన కాదనలేకపోతున్నాడట.ఎక్కువ రెంట్ ఇస్తామని ఎవరు వచ్చినా తను ఇవ్వడం లేదట.

ఒక వ్యక్తి సెంటిమెంట్ ను తాను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్తున్నాడు ఆ ఇంటి ఓనర్.

Telugu Hyderabad, Panjagutta, Tollywood, Trivikram, Trivikram Shock-Telugu Stop

అంతేకాదు.ప్రీగా ఉన్న సమయంలో త్రివిక్రమ్ ఆ రూంకి వెళ్లి వొస్తుంటాడట.తన మిత్రులతో కలిసి అక్కడ కాసేపు గడుపుతాడట.

పాత విషయాలను మరోసారి నెమరు వేసుకుంటాడట.ఇప్పటి వరకు ఈ అద్దె విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదట.కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యాన ఈ విషయం అందిరికీ తెలిసిందదట.20 ఏండ్లుగా ఆ రూంకు అద్దె ఇవ్వడం పట్ల చాలా మంది ఆశ్యర్యపోతున్నారట.ఆయన సెంటిమెంట్ కు ఎంత గౌరవం ఇస్తాడో ఇప్పుడు అర్థం అయ్యింది అంటున్నారు పలువురు సినీ జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube