Mahesh Babu Trivikram : త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?

మాటల మాత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా తర్వాత షెడ్యూల్ కి కొద్దిగా టైం తీసుకున్నారు.

 Trivikram Sentiment Break For Ssmb28 ,  Mahesh Babu, Pooja Hegde,rashmika,ssmb28-TeluguStop.com

ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రం సినిమా కోసం తన సెంటిమెంట్ ఒకటి బ్రేక్ చేస్తునాడని తెలుస్తుంది.త్రివిక్రం సినిమాల్లో ఇప్పటి వరకు ఐటం సాంగ్ అన్నది లేదు.

ఆ సాంగ్స్ అనవసరం అనుకుంటాడు త్రివిక్రం.అయితే సినిమాకు వచ్చే విభిన్న రకాల ఆడియన్స్ లో ఆ స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు.

సుకుమార్ మాత్రం ఈ విషయంలో ఎక్కడ తగ్గడు.తన సినిమాలో కచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ పెట్టేస్తాడు.అయితే త్రివిక్రం కూడా ఇప్పుడు తన సెంటిమెంట్ బ్రేక్ చేసి ఎస్.ఎస్.ఎం.బి 28 సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ పెడుతున్నాడట ఈ సాంగ్ లో ప్రముఖ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్.అదే జరిగితే త్రివిక్రం కూడా పూర్తిగా కమర్షియల్ ఫార్మెట్ లోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం 11 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube