మొన్న నితిన్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ‘అ ఆ ‘ సినిమా రిజల్ట్ అదిరిపోయింది.స్వచ్చమైన కామెడీ తో కూడా కావలసినంత వినోదం ఇవ్వచ్చు అని మళ్ళీ మళ్ళీ నిరూపించాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
కేవలం మాటల మధ్యన వినోదం పండించడం కోసం త్రివిక్రమ్ పడే కష్టం అంతా ఇంతా కాదు.
రక్త పాతం – హింసలూ లేకుండా జాగ్రత్తగా సినిమాలు తీస్తుంటారు ఆయన.ఆమధ్య అత్తారింటికి దారేది ఇప్పుడు అ ఆ తరహాలో మరొక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ అని సమాచారం.త్రివిక్ర ద్రుష్టి ఇప్పుడు పూర్తిగా ఫామిలీ ఎంటర్టైనర్ ల మీదనే పడింది.
కుటుంబ నేపధ్యం లో వచ్చే స్వచ్చమైన కథలు తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఆయన.
సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా ఆ కోవకి చెందినదే.అత్తారింటికి దారేది లాంటి మరొక ఫామిలీ స్టోరీ ని పవన్ కళ్యాణ్ కోసం సిద్దం చేస్తున్నారట త్రివిక్రమ్.ఒక హార్డ్ ఫామిలీ సెంటిమెంట్ కి లవ్ స్టోర్ తో పాటు మంచ్ యాక్షన్ జోడించడం కోసం సిద్దం అవుతున్నారు.
ఇప్పటికే రెండు లైన్స్ అనుకుంటున్నారు రెండిట్లో ఒకటి ఓకే అయితే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేస్తారు.